
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ ఏడాదిలోనే తండ్రైన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి రహస్య(Rahasya Gorak ) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట తమ ముద్దుల కుమారుడితో చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. కిరణ్ అబ్బవరం, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఇక కిరణ్ అబ్బవంరం సినిమాల విషయాలకొస్తే..‘క’తో గతేడాది భారీ హిట్ అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘దిల్ రూబా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘కె-ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు.
#TFNReels: Cutest fam vibes!😍
Actor @Kiran_Abbavaram and #RahasyaGorak’s adorable video with their lil munchkin is pure love!!💗#KiranRahasya #KiranAbbavaram #FamilyGoals #TeluguFilmNagar pic.twitter.com/VPg9xAOnXF— Telugu FilmNagar (@telugufilmnagar) June 30, 2025