'నాకు నిజంగా యాక్టింగ్ రాదు'.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ | Tollywood actress Renu Desai Comments at OM Pre Release evnet | Sakshi
Sakshi News home page

Renu Desai: 'నాకు నిజంగా యాక్టింగ్ రాదు'.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

Nov 17 2026 9:06 AM | Updated on Nov 17 2026 9:13 AM

Tollywood actress Renu Desai Comments at OM Pre Release evnet

ధనుశ్, శ్రీలీల జంటగా వస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఓం'. ఈ చిత్రాన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రంలో ఐపీఎస్ అధికారిణిగా సాయిపల్లవి కనిపించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ మూవీలో నటి రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది.

ఈ సందర్భంగా రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా ఆఫర్‌ నాకు శివరాత్రి రోజున వచ్చిందని తెలిపింది. అదే రోజు నేను కామాఖ్య ఆలయంలో ఉన్నానని ఆనందం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆడిషన్ లేకుండానే నన్ను తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయంలో డైరెక్టర్‌కు ధన్యవాదాలు అంటూ మాట్లాడింది.

 ప్రస్తుతం నా వయసు 45 ఏళ్లని.. నేను చూడటానికి ఇంకేం లేదని అన్నారు. నాకు నిజంగానే యాక్టింగ్ రాదని రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మమ్ముట్టి సార్‌.. మీ ముందు నేను మాట్లాడాలంటే నేను వణికిపోతానని రేణు దేశాయ్ వెల్లడించారు. నాకు తమిళం రాదని.. నా తప్పులను క్షమించినందుకు ధనుశ్ సార్‌కు ధన్యవాదాలు తెలిపింది. నాకు ఈ అవకాశమిచ్చిన దర్శకుడికి థ్యాంక్స్ అంటూ ముగించారు రేణు దేశాయ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement