ధనుశ్ హీరోగా చేస్తూ నిర్మించిన సినిమా 'ఓం'. ఎర్రచందనం స్మగ్లింగ్, కూలీలని పోలీసులు కాల్చేయడం అనే నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ధనుశ్ సరసన హీరోయిన్‌గా శ్రీలీల నటించారు. ఈ చిత్రంలో ఐపీఎస్ అధికారిణిగా సాయిపల్లవి కనిపించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ఎక్కడికెళ్లినా కూడా తెలుగు అమ్మాయిగానే గుర్తుంచుకుంటారు.. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీలవుతుంటా అని తెలిపింది. ముంబయిలో మెడిసిన్ ఇంటర్న్‌షిప్ టైమ్‌లో సినిమా అవకాశాలొచ్చినా చేయలేకపోయానని వెల్లడించింది. నేను చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను.. నాకు ఏ సినిమాలో ఛాన్స్ వచ్చిన చేసుకుంటూ వచ్చానని పేర్కొంది.
సినిమాల ఎంపికలో నేను తప్పులు ఎక్కడ చేశానని ప్రశ్నించుకున్నానని శ్రీలీల తెలిపింది. ఖాళీ సమయం దొరికినప్పుడు ఆలోచిస్తే.. నేను చేసిన తప్పేంటో అర్థమైందని వెల్లడించింది. ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామికి థ్యాంక్స్ చెప్పాలి.. ఈ సినిమాలో పాటలు ఉండవని నాతో ముందే చెప్పారని తెలిపింది. రాజ్ కుమార్ పెరియసామి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని శ్రీలీల అన్నారు.


