ఈసారీ గ్రాండ్‌గా... | Santosham South Indian Film Awards on August 16th: Hyderabad | Sakshi
Sakshi News home page

ఈసారీ గ్రాండ్‌గా...

Aug 4 2025 3:36 AM | Updated on Aug 4 2025 3:36 AM

Santosham South Indian Film Awards on August 16th: Hyderabad

‘సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్‌ 2025’ కార్యక్రమాన్ని ఈ నెల 16న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ వేడుక డేట్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళీమోహన్, కేఎస్‌ రామారావు మాట్లాడుతూ– ‘‘తెలంగాణలో పదేళ్ల తర్వాత గద్దర్‌ అవార్డ్స్‌ ఇచ్చారు.

ఏపీలో త్వరలో ఫిలిం అవార్డ్స్‌ ఇవ్వబోతున్నారు. ఈ సంతోషం అవార్డ్స్‌ని ఘనంగా చేయడానికి సపోర్ట్‌ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘ఇప్పటివరకూ సంతోషం అవార్డ్స్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేశాం. అందరి సపోర్ట్‌తో ఈ 24వ అవార్డు ఈవెంట్‌ని కూడా ఘనంగా చేయబోతున్నాం’’ అన్నారు సంతోషం మేగజీన్‌ అధినేత, నిర్మాత సురేష్‌ కొండేటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement