శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. స్టూడెంట్‌ డ్యాన్స్‌కు హీరో ఫిదా! | Kireeti latest Movie Viral Vayyari Song student dance goes Viral | Sakshi
Sakshi News home page

Viral Vayyari Song: శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. స్టూడెంట్‌ అదరగొట్టేసింది!

Jul 23 2025 5:16 PM | Updated on Jul 23 2025 5:45 PM

Kireeti latest Movie Viral Vayyari Song student dance goes Viral

ఇటీవల సినీ ప్రియులను రేంజ్లో ఊపేస్తోన్న హీరోయిన్ శ్రీలీల. గతేడాది పుష్ప-2 చిత్రంలో కిస్సిక్సాంగ్తో అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి ఊపున్న సాంగ్తో మెప్పించింది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వచ్చిన జూనియర్ మూవీలో వైరల్ వయ్యారి అంటూ అభిమానుల ముందుకొచ్చింది. మాస్ సాంగ్సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి అంటూ రీల్స్తో అదరగొట్టేసింది.

అంతలా క్రేజ్ దక్కించుకున్న పాటకు కర్నాటకకు చెందిన విద్యార్థిని చేసిన డ్యాన్స్ నెట్టింట వైరలవుతోంది. హీరో కిరిటీ సమక్షంలోనే బాలిక అద్భుతంగా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను హీరో కిరిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థినికి హీరో కిరిటీ చిరుకానుక అందించారు. ఇది చూసిన నెటిజన్స్విద్యార్థిని టాలెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా చేశావంటూ కితాబిస్తున్నారు.

కాగా.. కిరిటీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్. సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు. మూవీ జూలై 18 తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement