
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఇటు తెలుగులో.. అటు కన్నడలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తెలుగులో వరుస సినిమాలు చేసిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కన్నడ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో జెనీలియా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమాలో ఓ క్రేజీ సాంగ్ పుష్ప-2 రేంజ్లో వైరలైంది. పుష్పలో శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్ను తలపించింది. వైరల్ వయ్యారి అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ను ఓ ఊపు ఊపేసింది. దీంతో ఎక్కడ చూసిన వైరల్ వయ్యారి అనే సాంగ్ తెగ వైరలవుతోంది.
అయితే తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తన అమ్మమ్మతో చేసిన ఫన్నీ వీడియో నెటిజన్స్ను ఆకట్టుకుంటోంది. అమ్మమ్మ నిన్ను అందరు వైరల్ వయ్యారి అంటున్నారు అని శ్రీలీల చెప్పగా.. నన్నెందుకు అంటారు..నన్ను ఎవరు అనరు.. నిన్నే కదా అనేది అంటూ నవ్వుతూ మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
#ViralVayyari aka @sreeleela14's fun banter with her grandmother is the cutest thing we can see today!!😂❤️#Sreeleela #Junior #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/ru3ppiIRR7
— Telugu FilmNagar (@telugufilmnagar) July 16, 2025