ఎంటర్‌టైనింగ్‪‌గా 'సూ ఫ్రమ్ సో' ట్రైలర్ | Su From So Movie Trailer | Sakshi
Sakshi News home page

Su From So: 'కాంతార' నటులు చేసిన హారర్ కామెడీ

Jul 23 2025 12:35 PM | Updated on Jul 23 2025 4:09 PM

Su From So Movie Trailer

ఏ ఇండస్ట్రీలో తీసుకున్నా సరే ప్రస్తుతం విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులోనూ రీసెంట్ టైంలో అలా పలు సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు విలేజ్ స్టోరీ హారర్ కామెడీ మిస్ చేసి తీసిన కన్నడ చిత్రం 'సూ ఫ్రమ్ సో'. ఈ నెల 25న అంటే శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సంగతేంటి? ట్రైలర్ ఉందనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్)

'కాంతార' సినిమాలో హీరో రిషభ్ శెట్టి ఫ్రెండ్ పాత్రలు చేసిన నటులు ఈ మూవీలోనూ నటించారు. రిషభ్ శెట్టి ఫ్రెండ్ రాజ్ బి శెట్టి దీన్ని నిర్మించారు. 'సూ ఫ్రమ్ సో' విషయానికొస్తే.. కర్ణాటకలోని తీరప్రాంతానికి చెందిన ఓ పల్లెటూరిలో అందరూ సంతోషంగా బతుకుతుంటారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో ఓ దెయ్యం ఆ ఊరికి వస్తుంది. అందరినీ భయపెడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చిందనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.

మంగళవారం రాత్రి ఈ సినిమాకు ప్రీమియర్లు పడగా.. పాజిటివ్ టాక్ వచ్చింది. చూస్తుంటే ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. ట్రైలర్ కూడా ప్రామిసింగ్‌గా కనిపించింది. థియేటర్లలో తెలుగు రిలీజ్ లేదు గానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ మూవీపై లుక్కేయొచ్చనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ))

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement