
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవలే మార్గన్ మూవీతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. మరో మూవీతో వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న భద్రకాళి. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇది విజయ్ ఆంటోనీ కెరీర్లో 25వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా భద్రకాళి మూవీ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్లో విజయ్ ఆంటోని బర్త్ డే వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈవెంట్లో కేక్కు బదులు బిర్యానీని కట్ చేసి రోటీన్కు భిన్నంగా బర్త్ డే జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు కేక్ ప్లేస్లో బిర్యానీ ఏంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. 'అరువి', 'వాళ్' లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన అరుణ్ ప్రభు.. విజయ్ ఆంటోనితో 'భద్రకాళి' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోట్ల స్కామ్ చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.