
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ రాజమౌళితో.. కన్నడ వర్షన్ ట్రైలర్ను కిచ్చా సుదీప్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన వైరల్ వయ్యారి అనే ఐటమ్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.
Happy to release the trailer of @KireetiOfficial’s #Junior… Wishing him all the best on his debut and best wishes to the entire team for the release on July 18th!#JuniorTrailer https://t.co/qDwK35QvR2
— rajamouli ss (@ssrajamouli) July 11, 2025