
గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్‌లో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
మూవీ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే కాలేజీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా జులై 18న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో రవి చంద్రన్, జెనీలియా, రావు రమేష్, సుధారాణి, అచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.