
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘జూనియర్’. ఈ నెల 18న విడుదల అవుతున్నా ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అగ్ర నటీనటులతో దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీ కొర్రపాటి నిర్మాత. శ్రీలీల కథానాయికగా నటించింది. జెనీలియా, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే, జెనీలియా కోసం సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ప్రత్యేకమైన పాటతో మెప్పించారు.
ఒకప్పుడు తెలుగు తెరపై యూత్ కలలరాణిగా జెనీలియా గుర్తింపు పొందారు. సుమారు 13 ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్పై ఆమె మళ్లీ 'జూనియర్' సినిమాతో కనిపించనుంది. దీంతో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ 'బొమ్మరిల్లు' సినిమా నుంచి 'అప్పుడో ఇప్పుడో కలగన్నానే చెలి' సాంగ్తో ఆమెను మెప్పించారు. ఈ సాంగ్తో పాటు బొమ్మరిల్లు సినిమా కూడా జెనీలియా కెరీర్లో చాలా ప్రత్యేకం. అందుకే ఆమె కూడా దేవీ పాటకు బాగా కనెక్ట్ అయ్యారు. సోషల్మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.
‘బొమ్మరిల్లు’లో జెనీలియా పోషించిన హాసిని పాత్ర అందరికి గుర్తుండిపోయింది. వివాహానంతరం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఆమె దాదాపు 13ఏళ్ల విరామం తర్వాత దక్షిణాదిలో 'జూనియర్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో జెనీలియా కీలక చాలా కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా కథ తనతో పాటు భర్త రితేష్‌దేశ్‌ముఖ్‌కు కూడా బాగా నచ్చడంతోనే నటించానని ఆమె చెప్పారు. బొమ్మరిల్లులో హాసిని, హ్యాపీలో మధుమతి పాత్రలు ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మెమొరబుల్‌గా మిగిలిపోయాయని చెప్పవచ్చు. అందుకే జెనీలీయా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.