వైరల్‌ వయ్యారి పాటకు స్టేజీపై స్టెప్పులేసిన శివన్న | Shiva Rajkumar Dance With Sreeleela, Kireeti For Viral Vayyari Song | Sakshi
Sakshi News home page

వైరల్‌ వయ్యారి పాటకు హీరోహీరోయిన్‌తో స్టెప్పులేసిన శివన్న.. వీడియో వైరల్‌

Jul 14 2025 12:05 PM | Updated on Jul 14 2025 12:12 PM

Shiva Rajkumar Dance With Sreeleela, Kireeti For Viral Vayyari Song

ఎక్కడ చూసినా వైరల్‌ వయ్యారి నేనే.. పాటే వినిపిస్తోంది. ఇందులో శ్రీలీల, కిరీటి జంటగా డ్యాన్స్‌ చేశారు. శ్రీలీల గ్రేస్‌, డ్యాన్స్‌ గురించి తెలియంది కాదు! ఎప్పటిలాగే అల్లాడించేసింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కిరీటి గురించే! జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని అయిన ఈ యంగ్‌ హారో.. ఆయనలాగే పపర్‌ఫుల్‌గా స్టెప్పులేశాడు. నిన్ను చూస్తుంటే తారక్‌ను చూస్తున్నట్లే ఉందని చాలామంది కిరీటపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇతడు గాలి జనార్దన్‌ రెడ్డి కుమారుడు. జూనియర్‌ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.

వయ్యారి సాంగ్‌కు స్టేజీపై స్టెప్పులు
ఈ మూవీ జూలై 18న విడుదల కానుంది. ఈ క్రమంలో బెంగళూరులో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ (Shiva Rajkumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో కిరీటి శివన్నతో స్టేజీపై స్టెప్పులేయించాడు. వైరల్‌ వయ్యారి పాటకు స్టెప్పు ఇది.. అని ఒకసారి చూపించగనే శివన్న ఇట్టే నేర్చేసుకున్నారు. పాట ప్లే అవుతుంటే ఫుల్‌ జోష్‌లో డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

జూనియర్‌ సినిమా విశేషాలు
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన చిత్రం జూనియర్‌. జెనీలియా దేశ్‌ముఖ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలకు పని చేసిన కేకే సెంథిల్‌ కుమార్‌ జూనియర్‌ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

 

 

చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్‌.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అంతలోనే సిట్టింగా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement