breaking news
Kireeti Reddy
-
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సినిమా మేకింగ్, గ్రాఫిక్స్ పనితీరుపై తీవ్రమైన విమర్శలు రావడంతో వీరమల్లుపై గట్టిదెబ్బ పడింది. రెండో రోజున బాక్సాఫీస్ వద్ద 85 శాతం వరకు కలెక్షన్స్ పడిపోయాయి. దీంతో చాలా చోట్ల శనివారం నుంచే వీరమల్లును తొలగించి మరో సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలో వైజాగ్‌లోని లీలామహల్, వెంకటేశ్వర వంటి గుర్తింపు ఉన్న సింగిల్ థియేటర్స్ నుంచి వీరమల్లు చిత్రాన్ని తొలగించేశారు.'లీలామహల్' నుంచి వీరమల్లు ఔట్విశాఖపట్నంలో లీలామహల్ థియేటర్‌కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 600 సీట్లతో నిర్మించిబడిన ఈ థియేటర్‌కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రీసెంట్గా పెద్ద ఎత్తున అధునీకరణ చేశారు. జనసేన ఎమ్మేల్యేలు కూడా తమ కార్యకర్తలతో జులై 24న ఇక్కడ సినిమా చూశారు. ప్రీమియర్‌తో పాటు మొదటిరోజున అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. కానీ, రెండోరోజు మొదటి ఆటకు కేవలం 29 టికెట్లు మాత్రమే తెగడంతో శనివారం నుంచే ఈ చిత్రాన్ని తొలగించి 'జూనియర్' సినిమాను ప్రదర్శించారు. వీకెండ్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో సంచలనంగా మారింది. ఆపై వీరమల్లు సినిమాకు వన్ వీక్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే ఆంశమని చెప్పవచ్చు. ఎలాగూ ఒక వారం అగ్రిమెంట్ వుంది కనుక వీరమల్లును అలా రన్ చేయవచ్చు. కానీ, మరీ 30 టికెట్ల లోపు మాత్రమే తెగుతుండటం.. ఆపై సోమవారం నుంచి ఇవీ కూడా వుండవేమో అనే అనుమానంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే విశాఖలోనే వెంకటేశ్వర థియేటర్‌తో కూడా వన్ వీక్ అగ్రిమెంట్ 'వీరమల్లు'కు వుంది. కానీ, అక్కడ కూడా మహావతార్ నరసింహ సినిమాను వేసుకున్నారు. ఇలా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో వీరమల్లును తొలగించి మహావతార్, జూనియర్ చిత్రాలను ప్రదర్శించడం విశేషం. ఒక స్టార్ హీరో సినిమాను ఇలా పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు లేని సినిమాలను ప్రదర్శిస్తుండటం నెట్టింట వైరల్ అవుతుంది. వీరమల్లు సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని పవన్ అభిమానులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆపై ఏకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి పవన్ అభిమానులతో కాన్ఫిరెన్స్ కాల్స్ మాట్లాడారు. అందుకు సంబంధించిన సంభాషణ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. -
'జూనియర్' టైటిల్ వీడియో సాంగ్.. కిరీటి డ్యాన్స్ అదుర్స్
వ్యాపారవేత్త గాలి జనార్దనరెడ్డి (Janardhana Reddy) కుమారుడు కిరీటి (Kireeti) హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'జూనియర్'.. జులై 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం కిరీటి డ్యాన్స్ అని నెటిజన్లు పేర్కొన్నారు. దీంతో పాటలు ట్రెండ్ అయ్యాయి. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటించగా జెనీలియా, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూనియర్ చిత్రంలో వైరల్ వయ్యారి సాంగ్ తర్వాత టైటిల్ సాంగ్‌లో కిరీటి డ్యాన్స్ బాగుందని ప్రసంశలు పొందాడు. అలాంటి సాంగ్‌ను మీరూ చూసేయండి. -
'వైరల్ వయ్యారి' కొరియోగ్రాఫర్ మన మణుగూరు బిడ్డనే..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సోషల్‌మీడియాలో 'వైరల్ వయ్యారి' అంటూ 'జూనియర్' సినిమా సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే సౌండ్ వినిపిస్తుంది. అయితే, ఈ పాటకు హీరో కిరీటి, శ్రీలీల పోటీపడి డ్యాన్స్ చేశారు. పాట మొత్తం ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేశారు. అయితే, ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన కుర్రోడు ఎవరు..? అని సోషల్‌మీడియాలో వెతుకుతున్నారు. ఈ పాటకు స్టెప్పులు వేయించింది తెలంగాణ బిడ్డే.. మణుగూరుకు చెందిన రేవంత్ మాస్టర్ ఈ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన రేవంత్ పూలమార్కెట్ ప్రాంతంలో ఉంటాడు. తన అమ్మగారు సుభద్ర పూలదుకాణం నడుపుతున్నారు. భర్తను కోల్పోయిన ఆమె పట్టుదలతో ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెను ఉన్నంతలో చదివించారు. వారిలో చిన్నవాడైన రేవంత్‌కు డ్యాన్స్ అంటే పిచ్చి. దీంతో పదో తరగతి పూర్తి అయిన తర్వాత 2013లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ చిన్నచిన్న ఈవెంట్లు చేశాడు. తండ్రి మరణం తర్వాత ఇబ్బందులు వచ్చినా తన అమ్మగారు పూలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించింది. రేవంత్ కూడా హైదరాబాద్‌లో పనిచేస్తూ.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరి డ్యాన్స్‌లో శిక్షణ పొందాడు. అక్కడి నుంచి అతని ప్రయాణం మరో అడుగు ముందుకు పడింది.సైడ్ డ్యాన్సర్‌గా పనిచేసిన రేవంత్.. ఢీ 9వ సీజన్లో కంటెస్టెంట్‌గా మెప్పించాడు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఢీ 15వ సీజన్లో రెండో ఫైనలిస్ట్‌గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో శేఖర్ మాస్టర్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన పర్యవేక్షణలో ఆచార్య సినిమాలోని 'భలే బంజారా' పాటకు పనిచేశాడు. అలా సుమారు వందకు పైగా పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా రేవంత్ పనిచేయడం విశేషం. తన టాలెంట్‌ను గుర్తించిన జూనియర్ సినిమా మేకర్స్ ఏకంగా రెండు పాటలకు ఛాన్స్ ఇచ్చారు. వైరల్ వయ్యారి సాంగ్‌తో పాటు టైటిల్ సాంగ్‌కు కూడా రేవంత్ కోరియోగ్రఫీ ఇచ్చాడు. తన విజయానికి తన అమ్మగారు ఎంత కష్టపడ్డారని ఆయన తెలిపాడు. ఆపై శేఖర్ మాస్టర్ నేర్పించిన మెలకువలు తన జీవితాన్ని మార్చేశాయని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Revanth_rey7 (@revanthgollamandala) -
వైరల్ వయ్యారి పాటకు స్టేజీపై స్టెప్పులేసిన శివన్న
ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి నేనే.. పాటే వినిపిస్తోంది. ఇందులో శ్రీలీల, కిరీటి జంటగా డ్యాన్స్ చేశారు. శ్రీలీల గ్రేస్, డ్యాన్స్ గురించి తెలియంది కాదు! ఎప్పటిలాగే అల్లాడించేసింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కిరీటి గురించే! జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన ఈ యంగ్ హారో.. ఆయనలాగే పపర్ఫుల్గా స్టెప్పులేశాడు. నిన్ను చూస్తుంటే తారక్‌ను చూస్తున్నట్లే ఉందని చాలామంది కిరీటపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇతడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు. జూనియర్ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.వయ్యారి సాంగ్‌కు స్టేజీపై స్టెప్పులుఈ మూవీ జూలై 18న విడుదల కానుంది. ఈ క్రమంలో బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో కిరీటి శివన్నతో స్టేజీపై స్టెప్పులేయించాడు. వైరల్ వయ్యారి పాటకు స్టెప్పు ఇది.. అని ఒకసారి చూపించగనే శివన్న ఇట్టే నేర్చేసుకున్నారు. పాట ప్లే అవుతుంటే ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.జూనియర్ సినిమా విశేషాలుప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించిన చిత్రం జూనియర్. జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పని చేసిన కేకే సెంథిల్ కుమార్ జూనియర్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. A true viral moment 💥💥Karunada Chakravarthy @NimmaShivanna Garu dances to the #ViralVayyari song with the lead pair at the Junior Grand Pre Release Event ❤🔥#Junior grand release on July 18th ✨A Rockstar @ThisIsDSP Musical 🎸🔥 pic.twitter.com/lpAxfYmnSa— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 13, 2025 చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అంతలోనే సిట్టింగా? -
అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి
గాలి జనార్దనరెడ్డి (Janardhana Reddy) కుమారుడు కిరీటి (Kireeti) హీరోగా ఎంట్రీ ఇచ్చేశారు. ఆయన నటించిన మొదటి సినిమా ‘జూనియర్’ (Junior) జులై 18న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో కిరీటి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. అదే సమయంలో కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ స్ఫూర్తితో కిరీటి ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు కూడా చెప్పారు. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తుంది. జెనీలియా, రావు రమేశ్ తదితరులు భాగం అయ్యారు. కన్నడ దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్లో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. బాహుబలి,ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన కె.కె.సెంథిల్‌కుమార్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.గాలి జనార్దనరెడ్డి వేల కోట్ల ఆస్తులకు కిరీటి వారసుడు.. అతను అనుకుంటే ఎన్నో వ్యాపారాలు చేయవచ్చు. కానీ, సినిమా మీద మక్కువతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా జరిగిన కిరీటి ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ, చాలా వినయంగా ఉన్నాడు అంటూ కామెంట్ల రూపంలో చెబుతున్నారు. అదే టైమ్‌లో తనలో టాలెంట్ ఏంటో ట్రైలర్, మొదట సాంగ్‌తో చూపించాడు. శ్రీలీలకు పోటీగా తన డ్యాన్స్‌తో కిరీటి మెప్పించాడు. తను వేసిన స్టెప్స్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్ది రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పిన కిరీటి.. తారక్‌ను కూడా మెప్పించేలా స్టెప్పులు వేశాడు.జీవితంలో ఒక్కసారైనా ఆయన్ను కలుస్తా: కిరీటిజూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని కిరీటి ఇలా చెప్పాడు.' నా ఫస్ట్ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. శ్రీలీలతో సమానంగా స్టెప్పులు వేశానంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే, ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఆ సాంగ్ విజయాన్ని ఆయనకు ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఎన్టీఆర్ డ్యాన్స్, నటన, వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను జీవితంలో ఒక్కసారైనా కలిసే ఛాన్స్ వస్తే చాలా సంతోషిస్తాను. నా సినిమా వేడుకకు అతిథిగా తారక్ సార్ వస్తే.. జీవితంలో ఎప్పిటికీ గుర్తుండిపోతుంది. నాకు ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా చాలా ఇష్టం. ఆయన్ను కలిస్తే అదృష్టంగా భావిస్తాను. అమ్మ మీద ప్రేమను, ఎన్టీఆర్ మీద ప్రేమను మాటల్లో చెప్పలేము. అలా అని నేను ఇతర హీరోలను, అభిమానులను తక్కువ చేయను. ఒక్కోక్కరికి ఒక హీరో అంటే ఎలా ఇష్టం ఉంటుందో నాకు కూడా ఎన్టీఆర్ అంటే అభిమానం' అని కిరీటి అన్నారు. -
‘జూనియర్’గా వస్తున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా దర్శకుడు రాధాకృష్ణ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర పోషించబోతుంది. వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించారు మేకర్స్. ఈచిత్రానికి ‘జూనియర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కిరిటీ బర్త్‌డేని పురస్కరించుకొని శుక్రవారం సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘చిన్నప్పటి నుంచి మనం ఏదో ఒకటి అయిపోదాం అనుకుంటాం. మనం అవ్వకపోయినా జీవితం ఏదో ఒకటి చేసేస్తుంది..’అంటూ సాగే ఈ వీడియో గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.