
కొన్నాళ్ల క్రితం వైరల్ వయ్యారి అంటూ శ్రీలీల పాట ఒకటి తెగ వైరల్ అయిపోయింది. ఇది 'జూనియర్' అనే సినిమాలోనిది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే థియేటర్లలోకి వచ్చి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా సరే ఇంకా ఓటీటీలోకి రాలేదు. అలాంటిది ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఓ అప్‌డేట్ వచ్చేసింది.
కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్ర పోషించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ అంతంత మాత్రంగానే ఆడింది. యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయింది. లెక్క ప్రకారం ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కానీ ఇప్పటివరకు స్ట్రీమింగ్ గురించి ఎలాంటి సౌండ్ లేదు. ఇప్పుడు ఆహా ఓటీటీ ఈ సినిమాని త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)
అయితే ఈ శుక్రవారం(సెప్టెంబరు 19) నుంచే 'జూనియర్'.. ఆహా ఓటీటీలోకి రానుందని సమాచారం. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే మాత్రం వచ్చే వారం పక్కా. ఈ సినిమా విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో నాలుగేళ్లు సరదాగా గడిపేస్తాడు. మంచి జ్ఞాపకాల్ని పోగుచేసుకుంటాడు. చదువు పూర్తయిన తర్వాత తాను ప్రేమించిన స్ఫూర్తి (శ్రీలీల) పనిచేసే కంపెనీలోనే జాబ్‌లో జాయిన్ అవుతాడు.
కానీ అక్కడ బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కి అభి అంటే నచ్చదు. విజయనగరం అనే ఊరు కూడా ఈమెకు నచ్చదు. అలాంటి ఇష్టం లేని ఊరికి, ఇష్టం లేని అభితో కలిసి విజయ్ వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ విజయనగరానికి, విజయకి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. మరి ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోకి సినిమా ఒకేసారి వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)