
టాలీవుడ్‌లో 'థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' అనే డైలాగ్‌తో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్... కెరీర్ ప్రారంభంలో విలన్ తరహా పాత్రలు చేశాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం కమెడియన్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇతడు దర్శకుడిగా మారి తన కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఓ మూవీ తీశాడు. గతేడాది ఇది థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా జనాలకు తెలియలేదు. అలాంటి చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)
పృథ్వీరాజ్ దర్శకుడిగా తీసిన సినిమా 'కొత్త రంగుల ప్రపంచం'. ఇతడి కూతురు శ్రీలు హీరోయిన్. క్రాంతి కృష్ణ హీరోగా నటించాడు. హారర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. గతేడాది జనవరి 20న థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులు దీన్ని కనీసం పట్టించుకోలేదు. తర్వాత అందరూ ఈ మూవీ గురించి పూర్తిగా మరిచిపోయారు. అలాంటిది దాదాపు ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. అయితే అద్దె విధానంలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
'కొత్త రంగుల ప్రపంచం' విషయానికొస్తే.. షూటింగ్ కోసం ఓ ఫామ్ హౌస్‌కు డైరెక్టర్ పృథ్వీ తన బృందంతో వెళ్తాడు. ఈయన తీసే సినిమాలో శ్రీలు, క్రాంతి కృష్ణ హీరోహీరోయిన్లు. ఫామ్ హౌస్‌కి గురువయ్య అనే మేనేజర్ ఉంటాడు. అయితే షూటింగ్ టైంలో ఆ ఇంట్లో ఏదో ఉందనే అనుమానం అందరికీ వస్తుంది. హీరోయిన్ శ్రీలు నటించేటపుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది గమనించిన పృథ్వీ.. ఓ గురువు దగ్గరకు వెళ్తే శ్రీలుని ఓ ఆత్మ ఆవహించిందని చెబుతాడు. అసలు ఆత్మ ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)
అమెజాన్ ప్రైమ్‌లో ఈ రోజు నుంచే 'కన్యాకుమారి' అనే తెలుగు సినిమా కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఆగస్టు 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు మూడు వారాల్లోకి అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి వచ్చింది. ఉచితంగానే చూడొచ్చు.
