
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు ఆయన బయోపిక్‌ని ప్రకటించారు. 'మా వందే' పేరుతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దక్షిణాదికి చెందిన టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుండటం విశేషం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)
మలయాళ హీరో ఉన్ని ముకుందన్.. ఈ సినిమాలో మోదీగా పాత్రలో కనిపించనున్నాడు. అలానే తెలుగు దర్శకుడు సీహెచ్.క్రాంతి కుమార్ తెరకెక్కిస్తున్నారు. 'కేజీఎఫ్' మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు పనిచేసిన సెంథిల్ కుమార్.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయనున్నారు.
ప్రస్తుతానికైతే ప్రీ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో 'ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది' అని రాసుకొచ్చారు. అంటే మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ బయోపిక్ తీయబోతున్నారా అనిపిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తీస్తున్న ఈ చిత్రాన్ని బహుశా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో? అయితే 2019లోనే 'పీఎం నరేంద్ర మోదీ' పేరుతో ఓ బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఇది రెండో బయోపిక్ అనమాట.
(ఇదీ చదవండి: పిల్లల మీద ఒట్టు.. డబ్బులు ఎగ్గొట్టారు.. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు: మంచు లక్ష్మీ)
