
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్(Junior Movie).. థియేటర్స్‌లో మెప్పించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రకటన కూడా చేసింది. ఇందులో ‘వైరల్ వయ్యారి..’ పాటకు శ్రీలీల, కిరీటి వేసిన స్టెప్పులు సినిమాకు భారీ హైప్ వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూశారు. అయితే, ప్రకటన వచ్చినప్పటికీ ఈ చిత్రం అనుకున్న సమయానికి స్ట్రీమింగ్‌కు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

జూనియర్ మూవీ ఆహా ఓటీటీలోకి రాబోతుందనే ఇప్పటికే అధికారికంగా ప్రకటంచిన సంగతి తెలిసిందే. నేడు (సెప్టెంబర్ 22) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. అయితే, ఇప్పటికీ కూడా ఆహా తెలుగు ఓటీటీలో జూనియర్ కనిపించలేదు. దీంతో అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 22 నుంచే నమ్మఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో జూనియర్ స్ట్రీమింగ్ కానుందని చెప్పారు. ఇది కన్నడ ఓటీటీ యాప్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అందులో కూడా విడుదల కాలేదని తెలుస్తోంది.
కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్ర పోషించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. వాస్తవంగా ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ మొదట దక్కించుకుంది. కానీ, ఇప్పటివరకు స్ట్రీమింగ్ గురించి ఆ సంస్థ పెద్దగా ప్రచారం చేయలేదు. ఈ క్రమంలో సడెన్‌గా ఆహా ఓటీటీ సంస్థ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా అనుకున్న సమయానికి జూనియర్ ఓటీటీలోకి రాకపోవడంతో అమెజాన్, ఆహాలతో మేకర్స్ ఏమైనా డీలింగ్స్ విషయంలో ఇబ్బందులు వచ్చాయా అనే సందేహం వ్యక్తమౌతుంది.