
వ్యాపారవేత్త గాలి జనార్దనరెడ్డి (Janardhana Reddy) కుమారుడు కిరీటి (Kireeti) హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'జూనియర్'.. జులై 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం కిరీటి డ్యాన్స్ అని నెటిజన్లు పేర్కొన్నారు. దీంతో పాటలు ట్రెండ్ అయ్యాయి. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించగా జెనీలియా, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూనియర్ చిత్రంలో వైరల్ వయ్యారి సాంగ్ తర్వాత టైటిల్ సాంగ్లో కిరీటి డ్యాన్స్ బాగుందని ప్రసంశలు పొందాడు. అలాంటి సాంగ్ను మీరూ చూసేయండి.