
కామెడీ పండిచడం చాలా కష్టమంటుంటారు. కానీ కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) అవలీలగా నవ్వించేయగలరు, గణేశ్ లాంటి సినిమాలతో భయపెట్టనూగలరు. ఇవి రెండూ మిక్స్ చేసేలా భయపెడుతూనే నవ్వించగలరు. 750కి పైగా సినిమాలు చేసిన ఆయన ఇక సెలవంటూ వెళ్లిపోయారు. జూలై 13న ఫిలిం నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది.
భగవంతుడు పిలుస్తాడని అప్పుడే అనుకున్నా..
నటుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీతారలు భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాత బండ్ల గణేశ్ సైతం కోట ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించాడు. కొద్దిరోజుల క్రితమే ఆయన్ను కలిశానని, అప్పుడు ఆయన పరిస్థితి చూడలేకపోయానన్నాడు. భగవంతుడు పిలుస్తాడని ఆరోజే అనుకున్నానని మీడియాతో మాట్లాడాడు. కోటగారంటే ఇష్టమని, ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందంటూ నటుడి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.
బండ్ల గణేశ్ పోస్ట్
అయితే అదే రోజు బండ్ల గణేష్ ఓ పోస్ట్ పెట్టగా.. దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలారోజుల తర్వాత స్నేహితులు ఇంటికొచ్చి కలిశారంటూ ఎక్స్ (ట్విటర్)లో ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో శ్రీకాంత్, శివాజీరాజా, అలీ, ఉత్తేజ్ ఉన్నారు. వీళ్లందరూ వినోదం సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. దీంతో ఇది చూసిన నెటిన్లు.. మీరందరూ వినోదం సినిమాకు సీక్వెల్ తీయండి, బాగుంటుంది అని సలహాలు ఇస్తున్నారు.
నెటిజన్స్ ఫైర్
అయితే కొందరు మాత్రం.. పెద్దాయన (కోట శ్రీనివాసరావు) పొద్దున్నే కదా చనిపోయింది. మీరప్పుడే సిట్టింగ్ మొదలుపెట్టారా?, కానీ గ్లాసులు దాచేసి భలే కవర్ చేశారు, అయినా కోటగారు మరణించారన్న బాధ మీకు కాస్తయినా ఉంటే కదా? అని ఆగ్రహిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఫ్రెండ్స్ కలిస్తే తప్పేముందని, దానికి విమర్శలు చేయడమెందుకని బండ్ల గణేశ్‌ను సమర్థిస్తున్నారు.

చదవండి: Jr NTR: తెలుగు ఇండస్ట్రీకి కోట శ్రీనివాసరావు ఒక్కరే.. మళ్లీ ఇంకో కోట పుట్టరు, రారు..