
బుల్లితెర నటి, బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంభం (Prana Kambam).. టీవీ షోలలోనే ఎక్కువగా కనిపిస్తోంది. భర్త శ్రీపాదతో కలిసి ఆ మధ్య ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్ కప్పు కొట్టేసింది. ప్రస్తుతం కన్నడలో క్వాల్టీ కిచెన్ అనే కామెడీ షోలో పాల్గొంటోంది. హీరోయిన్ రష్మిక మందన్నా ఈమెకు క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే! తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది ప్రేరణ.

బద్ధకం ఎక్కువే
ప్రేరణ మాట్లాడుతూ.. నాకు బద్ధకం ఎక్కువ. ఒక్కోసారి స్నానం చేయడానికి కూడా బద్ధకమనిపిస్తుంది. నా భర్త శ్రీపాద్‌తో నేను సంతోషంగా ఉన్నాను. అయితే మా లవ్‌స్టోరీలో ఏ గొడవలు లేవని చెప్పను. మేము కూడా బ్రేకప్ చెప్పుకున్నాం. నటిగా నా మొదటి ప్రాజెక్టులో హీరో చెంపపై ముద్దుపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఇబ్బందిపడ్డాను. ఇకపోతే శ్రీపాద్‌తో గొడవలైనప్పుడు ఇదంతా నేను తట్టుకోలేను అని బ్రేకప్ చెప్పాను. కానీ తర్వాత వెంటనే కలిసిపోయేవాళ్లం.
రష్మికతో మల్టీస్టారర్
రష్మిక మందన్నా నాకు క్లోజ్ ఫ్రెండ్. 'నేను తెలుగులో స్టార్ అవుతా.. రష్మిక కన్నడలో స్టార్ అవుతుంది.. ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలి' అని రష్మిక కుటుంబసభ్యులు నాతో అనేవారు. నేను కూడా చాలా అనుకున్నాను, కానీ ఏదీ జరగలేదు. ఒకప్పుడైతే తనకు నేను గుర్తున్నాను, మరి ఇప్పుడు గుర్తున్నానో, లేదో నాకు తెలియదు. (రష్మికను ఉద్దేశిస్తూ) రేయ్, ఒకసారి నన్ను కలవరా.. అని ప్రేరణ ఎమోషనల్‌గా మాట్లాడింది. ఇది చూసిన అభిమానులు.. ప్రేరణ, రష్మిక కలిస్తే చూడాలనుందని కామెంట్లు చేస్తున్నారు.