గుర్తుపట్టలేని విధంగా స్టార్‌ హీరో.. ఎవరో కనిపెట్టారా? | Kannada Star Hero Movie 666 Operation Dream Theatre First Look Out | Sakshi
Sakshi News home page

రెట్రో లుక్‌లో స్టార్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

Jul 9 2025 5:34 PM | Updated on Jul 9 2025 6:47 PM

Kannada Star Hero Movie 666 Operation Dream Theatre First Look Out

పైన కనిపిస్తున్న స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? ఆయన వెండితెరపై కాసేపు కనిపించినా సరే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అందుకు జైలర్‌ సినిమానే నిదర్శనం. ప్రస్తుతం జైలర్‌ మూవీ సీక్వెల్‌లో యాక్ట్‌ చేస్తున్నారు. అలాగే తెలుగులో రామ్‌చరణ్‌ పెద్ది సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈపాటికే ఆయనెవరో అర్థమైపోయుంటుంది. తనే కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ (Shiva Rajkumar). ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌.

సప్త సాగరాలు దాటి ఫేమ్‌ హేమంత్‌ ఎం.రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో శివన్న ధనంజయగా కనిపించనున్నారు. పోస్టర్‌లో ఆయన లుక్‌ గుర్తుపట్టలేకుండా ఉంది. సూటూబూటూ వేసుకుని, టై కట్టుకుని ఓ చేతిలో రివాల్వర్‌ పట్టుకుని సీరియస్‌గా కనిపిస్తున్నారు శివన్న. పుష్ప విలన్‌ డాలి ధనంజయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైశాక్‌ జె ఫిలింస్‌ బ్యానర్‌పై డాక్టర్‌ వైశాక్‌ జె. గౌడ నిర్మిస్తున్నారు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, చరణ్‌ రాజ్‌ సంగీతం అందిస్తున్నారు.

 

 

చదవండి: 2025లో టాప్‌ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement