
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా చెప్పుకోదగ సినిమాలేం థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. ఉన్నంతలో 'జూనియర్' కాస్త ఆకట్టుకునేలా ఉంది. ఎందుకంటే గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఇది. శ్రీలీల హీరోయిన్ కావడంతో కాస్త హైప్ ఏర్పడింది. దీనితో పాటు కొత్తపల్లిలో ఒకప్పుడు, పోలీస్ వారి హెచ్చరిక అనే మరో రెండు చిత్రాలు కూడా ఈ వీకెండే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
(ఇదీ చదవండి: లారెన్స్‌ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు')
మరోవైపు ఓటీటీలోనూ 15 చిత్రాలు-వెబ్ సిరీసులే స్ట్రీమింగ్ కానున్నప్పటికీ వీటిలో ఐదు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. కుబేర, భైరవం లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌తోపాటు ద భూత్ని అనే హిందీ చిత్రం, స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, గుటర్ గూ సీజన్ 3 సిరీస్‌లు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చిందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 14 నుంచి 20 వరకు)
అమెజాన్ ప్రైమ్
కుబేర (తెలుగు మూవీ) - జూలై 18
నెట్‌ఫ్లిక్స్
అపాకలిప్స్ ఇన్ ద ట్రాపిక్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 14
ద ఫ్రాగ్రంట్ ఫ్లవర్ సీజన్ 1 (జపనీస్ ఎనిమీ సిరీస్) - జూలై 14
వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18
హాట్‍స్టార్
కోయిటల్, హీరో అండ్ బీస్ట్ (స్పానిష్ సిరీస్) - జూలై 15
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 18
స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18
జీ5
భైరవం (తెలుగు సినిమా) - జూలై 18
ద భూత్ని (హిందీ మూవీ) - జూలై 18
సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18
లయన్స్ గేట్ ప్లే
జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18
రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18
టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) - జూలై 18
ఆపిల్ ప్లస్ టీవీ
సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 18
ఎమ్ఎక్స్ ప్లేయర్
గుటర్ గూ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూలై 17
(ఇదీ చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!')