Bhairavam Movie
-
ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోయిన్!
హీరోయిన్ ఆదితి శంకర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. కోలీవుడ్ హీరోయిన్ ఆదితి శంకర్ భైరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందు వస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భైరవం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. #AditiShankar Live Dance Performance for #OVennela Song at #Bhairavam Event#BellamkondaSaiSreenivas #ManchuManoj #NaraRohith pic.twitter.com/ehgv08ARi5— The Cult Cinema (@cultcinemafeed) May 18, 2025 View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
కట్టు బట్టలతో రోడ్డున పడేశారు: మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరును తలచుకుని ఎమోషనలయ్యారు.మంచు మనోజ్ మాట్లాడుతూ..' కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల దుస్తులు, చిన్నప్పటి నుంచి దాచుకున్న వాటితో సహా ఏది వదలకుండా రోడ్డున పడేశారు. మేము బయటికి కూడా వెళ్లడానికి కార్లు కూడా లేకుండా చేశారు. కానీ నాకు మాత్రం శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చాడు అన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్నా నా కోసం. ప్రతి ఒక్కరూ మేమున్నాం అంటూ నాకోసం నిలబడ్డారు. కానీ నాకొక్కటే బాధ. ఇంత చేసినా.. ఇంత జరిగినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నాపై ఎన్ని కేసులు వేసినా.. నాకు ఎవరి మీద కోపం రావట్లేదు.. బాధగా మాత్రమే ఉంది. అది నా బలహీనతో.. వాళ్ల బలమో నాకు అర్థం కావట్లేదు.' అని అన్నారు.తన తండ్రి గురించి మాట్లాడుతూ..'ఎన్ని జన్మలైనా.. ఈ జన్మకు మాత్రం నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే.. అది మార్చడం ఎవరి వల్ల కాదు..నా చిన్నప్పటి నుంచి ఆయన నేర్పించిన క్రమశిక్షణే. నీతి వైపు నిలబడాలని నాకు నేర్పించారు. నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కలా అందరూ చేరి తప్పు అంటున్నారు. ఏదేమైనా.. ఎన్ని జన్మలెత్తినా.. మీరే నా దేవుడు.. నా తండ్రి.. నా తల్లి.. మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 30న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో మంచు మనోజ్‌కు తన ఫ్యామిలీతో గొడవలు తలెత్తిన సంగతి తెలిసిందే. -
ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ముగ్గురు హీరోల 'భైరవం'.. ట్రైలర్ ఎలా ఉందంటే?
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. గతేడాది డిసెంబరు నుంచి రిలీజ్ మాట వినిపిస్తుంది. మరి కారణాలేంటో తెలీదు గానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా) ముగ్గురు హీరోల సీన్స్ తో పాటు అటు యాక్షన్, ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసేలా ట్రైలర్ కట్ చేశారు. చూస్తుంటే సినిమా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇందులో ఆనంది, దివ్య పిళ్లై, అదితీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఇది తమిళ సినిమా 'గరుడన్'కి రీమేక్. ట్రైలర్ చూస్తుంటే తెలుగు ఫ్లేవర్ కి తగ్గట్లే సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపించింది. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో కొన్నిరోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) -
ముగ్గురు హీరోలతో కష్టం అనుకున్నా! : దర్శకుడు విజయ్ కనకమేడల
‘‘చాలామంది ఫ్రీమేక్‌లు చేస్తున్నారు. కానీ... మేం అధికారికంగా రీమేక్ (తమిళ హిట్ ఫిల్మ్ ‘గరుడన్’కు తెలుగు రీమేక్ ‘భైరవం’) చేశాం. అయినా ప్రేక్షకులు ఏ సినిమా బాగున్నా చూస్తారు. అది రీమేకా... ఫ్రీమేకా? అని పెద్దగా ఆలోచించరు. ‘భైరవం’(Bhairavam Movie) సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. నా ప్రతి సినిమాలో ఉండే ఓ సామాజిక సందేశం ఈ సినిమాలోనూ ఉంది’’ అని అన్నారు దర్శకుడు విజయ్ కనకమేడల(Vijay Kanakamedala). బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విజయ్ కనకమేడల మాట్లాడుతూ–‘‘తమిళ సినిమా ‘గరుడన్’ కథ కమర్షియల్గానూ నాకు నచ్చింది. తెలుగులోనూ ముగ్గురు హీరోలతో చేయొచ్చనిపించింది. కథ అనుకున్నప్పుడే సాయిగారిని హీరోగా ఫైనల్ చేశాం. రోహిత్, మనోజ్గార్లను ఆ తర్వాత కలిస్తే, వారూ ఓకే చెప్పారు. కథలో ఈ ముగ్గురు హీరోలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. మొదట్లో ముగ్గురు హీరోలతో సినిమా చేయడం కష్టమేమో అనిపించింది. కానీ... ఈ ముగ్గురు ఆఫ్ స్క్రీన్‌లోనూ మంచి మిత్రులు. దాంతో నా పని సులువైంది. ఇక ‘భైరవం’ కథ విషయానికొస్తే... ముగ్గురు స్నేహితుల ఫ్యామిలీల మధ్య జరిగే కథ. ఒక గ్రామంలో గుడి ఉంటుంది. ఆ గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ భైరవుడి రూపం నుంచి సినిమాకి ‘భైరవం’ అని టైటిల్ పెట్టాం. కథలో ఒక హీరోకు (బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పాత్రను ఉద్దేశించి) చిన్నప్పట్నుంచి కాలభైరవుడు పూనతాడు. ఎందుకు? ఏమిటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లూ అలరిస్తాయి. నా తర్వాతి సినిమా ఇంకా ఖరారు కాలేదు. నా దగ్గర చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్గార్లకు తగిన కథలు ఉన్నాయి’’ అని అన్నారు.