డైరెక్టర్‌ నోటి దురుసు.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ భైరవం’ | Mega Fans Calls Boycotting Bhairavam Movie, Director Vijay Kanakamedala Gives Clarity On His Facebook Post | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ నోటి దురుసు.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ భైరవం’

May 23 2025 9:23 AM | Updated on May 23 2025 10:12 AM

Mega Fans Calls Boycotting Bhairavam Movie

‘సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. రెండిటిని మిక్స్‌ చేయడం కరెక్ట్‌ కాదు. కానీ కొంతమంది సినిమా స్టేజ్‌పై రాజకీయాలు మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్‌ చేస్తున్నారు. వారి సొంత అభిప్రాయాన్ని స్టేజ్‌పై వెల్లడించి.. చేజేతులా సినిమాను చంపేసుకుంటున్నారు. తాజాగా బైరవం(Bhairavam Movie) సినిమా దర్శకుడు విజయ్‌ కనకమేడల కూడా అదే చేశాడు. ఆయన నోటి దురుసు కారణంగా ఇప్పుడు బాయ్‌కాట్‌ భైరవం(#BoycottBhairavam) అనే హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఒకవైపు వైఎస్సార్‌సీసీ ఫ్యాన్స్‌..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. అసలేం జరిగింది?

ఆ డైలాగ్‌ అవసరమా?
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కారణాలేంటో తెలీదు గానీ పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎ‍ట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యం చిత్రబృందం వరుస ప్రమోషన్స్‌ కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏపీలో పెద్ద ఎత్తున​ నిర్వహించింది. అయితే ఆ స్టేజ్‌పై దర్శకుడు విజయ్‌ కనకమేడల చేసిన కామెంట్స్‌ కాంట్రవర్సీకి దారి తీశాయి.

‘ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్టుగా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు’అని సినిమా ఈవెంట్‌లో పొలిటికల్‌ కామెంట్స్‌  చేశాడు. దీంతో వైఎస్సార్‌సీసీ శ్రేణులు విజయ్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం లేకపోయినా..ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. భైరవం సినిమాను బహిష్కరించాలంటూ ‘బాయ్‌కాట్‌ భైరవం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విటర్‌లో వైరల్‌ చేస్తున్నారు. విజయ్‌ నోటి దురుసు కారణంగానే ఈ వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే మరోవైపు మెగా ఫ్యాన్స్‌ కూడా విజయ్‌పై మండిపడుతున్నారు. దానికి కారణం కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో విజయ్‌ పెట్టిన ఒక పోస్టే.

కొంపముంచిన ‘ఛా’
విజయ్‌ కనకమేడల ఫేస్‌బుక్‌లో 2011లో చిరంజీవి, రామ్‌ చరణ్‌లపై ఒక పోస్ట్‌ పెట్టాడు. హిందీలో అమితాబ్‌, అభిషేక్‌ కలిసి నటించిన ‘పా’ సినిమా పోస్టర్‌ని మార్పింగ్‌ చేసి చిరంజీవి, రామ్‌ చరణ్‌ ముఖాలను వాటిపై అతికించారు. ఆ పోస్టర్‌కి ‘ఛా’ అనే టైటిల్‌ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు ‘ఛా’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇప్పుడిదే మెగాఫ్యాన్స్‌ ఫైర్‌ అవ్వడానికి కారణం అయింది. చిరంజీవి, రామ్‌ చరణ్‌లను ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ మెగా ఫ్యాన్స్‌ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ దర్శకత్వం వహించిన భైరవం సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్‌ పిలుపునిచ్చారు.

హ్యాక్‌ అయిందా? అదేలా?
సోషల్‌ మీడియాలో బాయికాట్‌ భైరవం ట్యాగ్‌ ట్రెండ్‌ కావడంలో విజయ్‌ కనకమేడల దీనిపై రియాక్ట్‌ అయ్యాడు. ఆ పోస్ట్‌ తాను పెట్టింది కాదని, హ్యాక్‌ అయిందని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మెగాఫ్యాన్స్‌ మాత్రం హ్యాకింగ్‌ అనేది పచ్చి అబద్దం అని, 2011లో నువ్వ ఎవరో కూడా తెలియదు.. నీ అకౌంట్‌ని ఎలా హ్యాక్‌ చేస్తారు? ఒకవేళ చేసినా 14 ఏళ్లుగా నీ ఫేస్‌బుక్‌ని చెక్‌ చేసుకోలేదా? అని మెగా ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి దర్శకుడి నోటి దురుసు కారణంగా సినిమాకు ఎంతోకొంత నష్టం అయితే జరిగినట్లే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement