
తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అందుకుని అందరి అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతాయి. అలాంటి అంచనాలతో వస్తున్న చిత్రం 'ఘటికాచలం'.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. మంచి గ్రిప్పింగ్ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించినట్లు అర్ధం అవుతుంది. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రానున్న ఈ మూవీలో నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంసీ రాజు కథ అందించారు. ఈ చిత్రానికి ఫేవియో సంగీతమందిస్తున్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది.