breaking news
Nikhil Devadula
-
‘ఘటికాచలం’ మూవీ రివ్యూ
నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన చిత్రం ‘ఘటికాచలం’. ఈ చిత్రానికి ఎం.సి.రాజు కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించారు. అమర్ కామెపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ నేడు(మే 31) రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కౌశిక్ (నిఖిల్ దేవాదుల) మెడిసన్ స్టూడెంట్.తనకు ఇష్టం లేకపోయినా నాన్న (ప్రభాకర్)కోసం డాక్టర్ కావాలనుకుంటాడు. కనీసం తనకు ఇష్టం అయిన వంట చేయమని తల్లితో చెప్పలేని ఇంట్రోవర్ట్. కాలేజీలో తోటి విద్యార్థిని సంయుక్తని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి భయపడతాడు. ఇష్టంలేని చదువు ఒకవైపు..ఇష్టమైన విషయాలు చెప్పలేక మరోవైపు మానసికంగా ఇబ్బంది పడతాడు. కొన్నాళ్లకు తనకి మాత్రమే ఓ భీకరమైన వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ అతన్ని కంట్రోల్ చేస్తుంది. చదుకోనివ్వదు.. రెబల్‌గా మార్చేస్తుంది. ఓ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే.. సైకలాజికల్ ప్రాబ్లమ్ అని చెబుతారు. బాబాలు,మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్తే గాలి సోకిందని చెబుతారు. కౌశిక్‌తో మాట్లాడుతున్న వాయిస్ కొన్నేళ్ల క్రితం చనిపోయిన ఘటికాచలంది అని తెలుస్తుంది. అసలు ఘటికాచలం ఎవరు? కౌశిక్‌కి ఎలా పరిచయం అయ్యాడు? ఇంతకీ కౌశిక్‌కి దెయ్యం పట్టిందా లేదా మెంటల్ ప్రెజర్ తో అలా మారిపోయాడా? చివరకు కౌశిక్ ఆరోగ్యంగా బయటపడ్డాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే..చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలతో ఆకట్టుకున్న నిఖిల్ దేవాదులకి హీరోగా తొలి చిత్రం ఇది. ఫస్ట్ మూవీలోనే బలమైన పాత్ర పోషించాడు. ఈ పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. పాత్ర ఒక్కటే కానీ అందులోనే రెండు మూడు వేరియేషన్స్ ఉంటాయి. అలాంటి పాత్రకి నిఖిల్ పూర్తి న్యాయం చేశాడు. నటుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంటుంది. హీరో తండ్రిగా ప్రభాకర్, తల్లిగా దుర్గాదేవి ఉన్నంతలో బాగానే నటించారు. డాక్టర్‌గా ఆర్వికా గుప్తా తెరపై కనిపించేంది కాసేపే అయినా కథకి కీలకమైన పాత్ర ఆమెది. హీరోయిన్గా సంయుక్త రెడ్డి నటన ఓకే. జోగినాయుడు రెండు మూడు సీన్లలో కనిపించినా.. తన మార్క్ చూపించాడు.మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేంతికంగా సినిమా బాగుంది. ప్లేవియో కుకురోలో నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. హారర్ సన్నివేశాలకు ఆయన అందించిన బీజీఎం అదిరిపోయింది. ఎస్ ఎస్ మనోజ్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఘటికాచలం' ట్రైలర్
తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అందుకుని అందరి అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతాయి. అలాంటి అంచనాలతో వస్తున్న చిత్రం 'ఘటికాచలం'.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. మంచి గ్రిప్పింగ్ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించినట్లు అర్ధం అవుతుంది. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రానున్న ఈ మూవీలో నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంసీ రాజు కథ అందించారు. ఈ చిత్రానికి ఫేవియో సంగీతమందిస్తున్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఘటికాచలం.. ఆసక్తిగా టీజర్!
నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఘటికాచలం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంసీ రాజు కథ అందించారు. ఈ చిత్రానికి ఫేవియో సంగీతమందిస్తున్నారు. -
ప్రేమ ప్రభావం
నిఖిల్ దేవాదుల (‘బాహుబలి’ ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘15–18–24 లవ్‌స్టోరీ’. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో మాజేటి మూవీ మేకర్స్, కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను కథానాయిక మెహరీన్ చేతుల మీదగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. 15–18–24 వయసులలో ప్రేమ, దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఒక భారీ యాక్సిడెంట్ హైలెట్‌గా నిలుస్తుంది. ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో ఈ ఫైట్‌ని చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బీవీ శ్రీనివాస్, బొద్దుల సుజాత శ్రీనివాస్. -
పిల్లలకూ.. పెద్దలకూ...
యుక్త వయసులోకి అడుగుపెట్టిన పిల్లలతో చర్చించాల్సిన విషయాలను విస్మరించడం వల్ల జరిగే విపత్కర పరిణామాల నేపథ్యంలో ఓఎంజీ (ఆఫ్ బీట్ మీడియా గైడ్) బేనర్ ఓ చిత్రం నిర్మిస్తోంది. శ్రీకాంత్ వెలగలేటి దర్శకత్వంలో ఆనంద్ చవాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేశ్ ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూరు రామ్మోహనరావు క్లాప్‌నిచ్చారు. నిఖిల్ దేవాదుల, అష్నూర్ కౌర్, అనుష్కా సేన్, చేతన్ జయలాల్, ప్రగత్ కీలక పాత్రధారులు. ‘‘హిందీ హీరో, జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ మరాఠీలో నిర్మించిన ‘బాలక్ పాలక్’కి ఇది రీమేక్. ఈ నెల 7న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘పెద్దలకు, పిల్లలకు ఉపయోగకరంగా ఉండే అంశాలతో ఈ చిత్రం చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. నరేశ్, తేజస్వి మదివాడ, ఈటీవీ ప్రభాకర్, వినోద్ బాల, నళిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చీనార్ మహేశ్, విశాల్–శేఖర్, కెమేరా: అంజి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డా. ఆకునూరు గౌతమ్, లైన్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ రెడ్డి న్యాలకొండ.