breaking news
Vijay Kanakamedala
-
గరుడన్ తెలుగు రీమేకె 'భైరవం'.. ఏ ఓటీటీలో ఉందంటే
'భైరవం' సినిమా మే 30న విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది. ఈ సినిమా ఓరిజినల్ కాపీ అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతుంది. అలాంటప్పుడు రీమేక్ భైరవం కోసం జనాలు థియేటర్‌కు వస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల నోటిదురుసు వల్ల బాయ్‌కాట్ భైరవం (#BoycottBhairavam) అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఒకవైపు వైఎస్సార్సీసీ ఫ్యాన్స్..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు.తమిళ సినిమా 'గరుడన్'కు రీమేక్‌గా 'భైరవం' సినిమాను విజయ్ కనకమేడల తెరకెక్కించాడు. గతేడాదిలో తమిళ్లో మాత్రమే విడుదలైన గరుడన్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.తమిళ నటుడు సూరి లీడ్ రోల్లో నటించగా అతని స్నేహితులుగా శశికుమార్, ఉన్నిముకుందన్ కీలకపాత్రలు పోషించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాను ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. వెట్రిమారన్ కథ అందించాడు.భైరవంలో కూడా ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించారు. గరుడన్ కథ నచ్చే తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించాలని భైరవం తీస్తున్నట్లు దర్శకుడు విజయ్ కనకమేడల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, మాతృకతో పోలిస్తే మన ప్రేక్షకులకు నచ్చేలా అవసరమైన మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్లకి కూడా కొత్త అనుభూతిని అందించేలా ఈ కథలో మార్పులు చేసినట్లు ఆయన అన్నారు. -
డైరెక్టర్ నోటి దురుసు.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ భైరవం’
‘సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. రెండిటిని మిక్స్ చేయడం కరెక్ట్ కాదు. కానీ కొంతమంది సినిమా స్టేజ్‌పై రాజకీయాలు మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. వారి సొంత అభిప్రాయాన్ని స్టేజ్‌పై వెల్లడించి.. చేజేతులా సినిమాను చంపేసుకుంటున్నారు. తాజాగా బైరవం(Bhairavam Movie) సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల కూడా అదే చేశాడు. ఆయన నోటి దురుసు కారణంగా ఇప్పుడు బాయ్‌కాట్ భైరవం(#BoycottBhairavam) అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఒకవైపు వైఎస్సార్సీసీ ఫ్యాన్స్..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. అసలేం జరిగింది?ఆ డైలాగ్ అవసరమా?మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కారణాలేంటో తెలీదు గానీ పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యం చిత్రబృందం వరుస ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని ఏపీలో పెద్ద ఎత్తున నిర్వహించింది. అయితే ఆ స్టేజ్‌పై దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి.‘ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్టుగా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు’అని సినిమా ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్ చేశాడు. దీంతో వైఎస్సార్సీసీ శ్రేణులు విజయ్ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం లేకపోయినా..ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. భైరవం సినిమాను బహిష్కరించాలంటూ ‘బాయ్‌కాట్ భైరవం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విటర్లో వైరల్ చేస్తున్నారు. విజయ్ నోటి దురుసు కారణంగానే ఈ వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా విజయ్‌పై మండిపడుతున్నారు. దానికి కారణం కొన్నేళ్ల క్రితం ఫేస్బుక్లో విజయ్ పెట్టిన ఒక పోస్టే.No apology will make up for these filthy acts. Unanimously #BoycottBhairavam and TFI should call for a ban on this director, #VijayKanakamedala. Anyone who books a ticket for this film isn’t just insulting the stars, they’re disrespecting the entire art of cinema. pic.twitter.com/ynpUYmF9Gd— At Theatres (@attheatres) May 22, 2025కొంపముంచిన ‘ఛా’విజయ్ కనకమేడల ఫేస్బుక్లో 2011లో చిరంజీవి, రామ్ చరణ్‌లపై ఒక పోస్ట్ పెట్టాడు. హిందీలో అమితాబ్, అభిషేక్ కలిసి నటించిన ‘పా’ సినిమా పోస్టర్ని మార్పింగ్ చేసి చిరంజీవి, రామ్ చరణ్ ముఖాలను వాటిపై అతికించారు. ఆ పోస్టర్‌కి ‘ఛా’ అనే టైటిల్ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు ‘ఛా’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇప్పుడిదే మెగాఫ్యాన్స్ ఫైర్ అవ్వడానికి కారణం అయింది. చిరంజీవి, రామ్ చరణ్‌లను ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ మెగా ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహించిన భైరవం సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు.హ్యాక్ అయిందా? అదేలా?సోషల్ మీడియాలో బాయికాట్ భైరవం ట్యాగ్ ట్రెండ్ కావడంలో విజయ్ కనకమేడల దీనిపై రియాక్ట్ అయ్యాడు. ఆ పోస్ట్ తాను పెట్టింది కాదని, హ్యాక్ అయిందని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మెగాఫ్యాన్స్ మాత్రం హ్యాకింగ్ అనేది పచ్చి అబద్దం అని, 2011లో నువ్వ ఎవరో కూడా తెలియదు.. నీ అకౌంట్‌ని ఎలా హ్యాక్ చేస్తారు? ఒకవేళ చేసినా 14 ఏళ్లుగా నీ ఫేస్‌బుక్‌ని చెక్ చేసుకోలేదా? అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దర్శకుడి నోటి దురుసు కారణంగా సినిమాకు ఎంతోకొంత నష్టం అయితే జరిగినట్లే.Mr. అతి @DirVijayK మాట పొదుపు గా ఉండాలి , చేతలకి అదుపు ఉండాలి 🤬🤬#BoycottBHAIRAVAM pic.twitter.com/1YFBJmPBQv— Aravind Reddy (@AravindOnAir) May 23, 2025 నమస్కారం అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025#Hacked #Tollywood #director #BoycottBHAIRAVAM #dengey #megadogs #mogga pic.twitter.com/NPM4jtyhQl— 𝔾𝕙𝕠𝕤𝕥ℝ𝕚𝕕𝕖𝕣🐉 (@yashwanthpotter) May 23, 2025 -
ముగ్గురు హీరోలతో కష్టం అనుకున్నా! : దర్శకుడు విజయ్ కనకమేడల
‘‘చాలామంది ఫ్రీమేక్‌లు చేస్తున్నారు. కానీ... మేం అధికారికంగా రీమేక్ (తమిళ హిట్ ఫిల్మ్ ‘గరుడన్’కు తెలుగు రీమేక్ ‘భైరవం’) చేశాం. అయినా ప్రేక్షకులు ఏ సినిమా బాగున్నా చూస్తారు. అది రీమేకా... ఫ్రీమేకా? అని పెద్దగా ఆలోచించరు. ‘భైరవం’(Bhairavam Movie) సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. నా ప్రతి సినిమాలో ఉండే ఓ సామాజిక సందేశం ఈ సినిమాలోనూ ఉంది’’ అని అన్నారు దర్శకుడు విజయ్ కనకమేడల(Vijay Kanakamedala). బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విజయ్ కనకమేడల మాట్లాడుతూ–‘‘తమిళ సినిమా ‘గరుడన్’ కథ కమర్షియల్గానూ నాకు నచ్చింది. తెలుగులోనూ ముగ్గురు హీరోలతో చేయొచ్చనిపించింది. కథ అనుకున్నప్పుడే సాయిగారిని హీరోగా ఫైనల్ చేశాం. రోహిత్, మనోజ్గార్లను ఆ తర్వాత కలిస్తే, వారూ ఓకే చెప్పారు. కథలో ఈ ముగ్గురు హీరోలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. మొదట్లో ముగ్గురు హీరోలతో సినిమా చేయడం కష్టమేమో అనిపించింది. కానీ... ఈ ముగ్గురు ఆఫ్ స్క్రీన్‌లోనూ మంచి మిత్రులు. దాంతో నా పని సులువైంది. ఇక ‘భైరవం’ కథ విషయానికొస్తే... ముగ్గురు స్నేహితుల ఫ్యామిలీల మధ్య జరిగే కథ. ఒక గ్రామంలో గుడి ఉంటుంది. ఆ గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ భైరవుడి రూపం నుంచి సినిమాకి ‘భైరవం’ అని టైటిల్ పెట్టాం. కథలో ఒక హీరోకు (బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పాత్రను ఉద్దేశించి) చిన్నప్పట్నుంచి కాలభైరవుడు పూనతాడు. ఎందుకు? ఏమిటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లూ అలరిస్తాయి. నా తర్వాతి సినిమా ఇంకా ఖరారు కాలేదు. నా దగ్గర చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్గార్లకు తగిన కథలు ఉన్నాయి’’ అని అన్నారు. -
కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం ‘K ర్యాంప్’ ప్రారంభం (ఫొటోలు)
-
అందుకే రూట్ మార్చాను
‘‘నరేశ్ చేసే కామెడీ సినిమాలు చాలా బాగుంటాయి అంటారు కానీ, కామెడీ సినిమాలో నరేశ్ బాగా చేశాడని ఎవరూ చెప్పరు. ‘నేను, గమ్యం, శంభో శివ శంభో, మహర్షి’ సినిమాల్లో నరేశ్‌లో ఓ నటుణ్ణి గుర్తించారు. నరేశ్ కామెడీ ఒక్కటే కాదు అన్ని పాత్రలు చేయగలడని పేరు తెచ్చుకోవాలని ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘నాంది’. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘మీ కామెడీ డ్రై అయిపోతోంది.. కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేయండి’ అని కొందరు నాతో చెప్పారు.. అందుకే రూట్ మార్చాను. మలయాళ సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ‘నాంది’ అలాగే ఉంటుంది. నా వద్దకు వచ్చే పది మంది దర్శక–నిర్మాతల్లో తొమ్మిది మంది కామెడీ కథలతోనే వస్తున్నారు. నాతో ప్రయోగాత్మక సినిమాలు చేయండని వారికి చెప్పలేను కదా! ‘నాంది’ కథని దర్శక–నిర్మాతలు నమ్మారు. ఈ సినిమా హిట్ అయితే నా నుంచి మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు వస్తాయి. ‘ఎవడిగోల వాడిది’లాంటి కథ విన్నాను. అంత మంది ఆర్టిస్టులతో కరెక్టుగా తెరకెక్కించే డైరెక్టర్ కావాలి. పాత్ర నచ్చితే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడానికి రెడీ. ఈ విషయంలో నాకు విజయ్ సేతుపతిగారే స్ఫూర్తి. ఎన్ని సినిమాలు చేశామన్నది కాకుండా ఎన్ని హిట్ సినిమాలు చేశామన్నదానిపైనే ప్రస్తుతం దృష్టి పెట్టాను’’ అన్నారు. -
అదే నా బలం: విజయ్ కనకమేడల
‘‘ఒక మనిషి తప్పు చేశాడో? లేదో? తెలియకుండానే ఐదేళ్లుగా విచారణ ఖైదీగా ఉంటాడు. బయటికొచ్చాక సమాజం అతన్ని విలన్ గా చూస్తుంటుంది. అప్పుడు ఏం చేశాడు? అనేదే ‘నాంది’ సినిమా’’ అని దర్శకుడు విజయ్ కనకమేడల అన్నారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నాంది’. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. విజయ్ కనకమేడల మాట్లాడుతూ– ‘‘రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. నవదీప్ ‘మొదటి సినిమా’ చేస్తున్నప్పుడు హరీష్ శంకర్‌గారు పరిచయమయ్యారు. ఆ చిత్రానికి ఆయన ఘోస్ట్ రైటర్. అక్కడి నుంచి మా ప్రయాణం ప్రారంభమై ‘డీజే’ వరకూ కొనసాగింది. ‘మహర్షి’ చూశాక ‘నాంది’లో నరేశ్‌గారు చేస్తేనే బాగుంటుందనిపించింది. కథ వినగానే ఆయన ఒప్పుకున్నారు. ఓ సీన్లో న్యూడ్‌గా నటించారు. ‘మా నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) తర్వాత అంత కంఫర్టబుల్‌గా ఫీలయింది మీతోనే’ అని నరేశ్‌గారు అనడం సంతోషంగా అనిపించింది. సేఫ్ జోన్ లో చాలా కథలు రెడీ చేసుకుని నిర్మాతలను కలిశాను.. కానీ కుదరలేదు. ‘నాంది’ కథ విని, సతీష్‌గారు ఓ మంచి సినిమాతో నిర్మాతగా మారుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భావోద్వేగంతో కూడిన కథలే నా బలం.. అలాంటి సినిమాలే తీస్తాను. నా తర్వాతి సినిమా కూడా నరేశ్గారితోనే ఉంటుంది’’ అన్నారు.