
సాక్షి, న్యూఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పటికే వేల మంది చనిపోయారని, ఇకనైనా ఆ తరహా మరణాలు సంభవించకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్(Betting Apps) వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్‌కే సింగ్ బెంచ్ విచారించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది.
ఈ పరిణామంపై కేఏ పాల్(KA Paul) మీడియాతో మాట్లాడారు. ‘‘బెట్టింగ్ యాప్స్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.అవసరమైతే రాష్ట్రాలకు కూడా నోటీసులు పంపిస్తామని పేర్కొంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల ఇప్పటికే వేల మంది చనిపోయారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని? ప్రశ్నిస్తూ సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది..
.. సిగరెట్ త్రాగితే హానికరం అని ఉంటుంది. స్మోకింగ్ కంటే మిలియన్ టైమ్స్ డేంజర్.. బెట్టింగ్ యాప్స్. దాదాపు 1,100 లకు పైగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ కోసం ప్రమోషన్ చేస్తున్నారు. బదులుగా కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల భవిష్యత్ లో ఆత్మహత్యలు జరక్కుండా చూడాల్సిన అవసరం ఉంది. మనీల్యాండరింగ్ జరగకుండా ఉండాలంటే.. బెట్టింగ్ యాప్ లను నిషేధించేలా కేంద్రం(Centre) చట్టం తీసుకురావాలి అని కేఏ పాల్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: అద్భుతమైన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు