పవన్‌ కల్యాణ్‌తో రామ్‌ చరణ్‌ సినిమా.. త్రివిక్రమ్‌ దర్శకుడు! | Crazy Buzz: After Peddi, Ram Charan Do Film With Trivikram, Sukumar Movie Postponed | Sakshi
Sakshi News home page

పవన్‌ ఎఫెక్ట్‌.. త్రివిక్రమ్‌తో చరణ్‌ మూవీ.. సుక్కు సినిమాకి బ్రేక్‌!

May 23 2025 3:02 PM | Updated on May 23 2025 3:18 PM

Crazy Buzz: After Peddi, Ram Charan Do Film With Trivikram, Sukumar Movie Postponed

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ (2024) సినిమా విడుదలై ఏడాదిన్నర దాటినప్పటికీ, ఆయన తదుపరి చిత్రంపై స్పష్టత లేకపోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మొదట్లో అల్లు అర్జున్‌తో పాన్-ఇండియా చిత్రం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, అది వర్కౌట్‌ కాలేదు.  

ప్రస్తుతం అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు 2026 వరకు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో, త్రివిక్రమ్  సినిమా తాత్కాలికంగా వాయిదా పడినట్లు మొన్నటిదాక ప్రచారం జరిగింది. ఇప్పుడు మొత్తానికి ఈ చిత్రం ఉండకపోవచ్చని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. బన్నీ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టి రామ్‌ చరణ్‌తో పాన్‌ ఇండియా సినిమా చేసేందుకు త్రివిక్రమ్‌ రెడీ అవుతున్నాడట. 

వెంకీ చిత్రం తర్వాత...
బన్నీ సినిమా వాయిదా పడడంతో  త్రివిక్రమ్ ఈ గ్యాప్‌లో విక్టరీ వెంకటేశ్‌తో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడట. ఈ చిత్రం కథా చర్చలు పూర్తయి, మరికొద్ది రోజుల్లో  సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇది పూర్తయిన తర్వాత బన్నీతో సినిమా చేస్తాడని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ అది కూడా జరిగేలా లేదు. త్రివిక్రమ్‌ ఆ ప్రాజెక్టుని పూర్తిగా పక్కకు పెట్టేసి.. రామ్‌ చరణ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.

పవన్‌ కోసం..
పవన్‌ కల్యాణ్‌ చొరవతో రామ్‌ చరణ్‌ కోసం త్రివిక్రమ్‌ ఓ క్రేజీ కథను రెడీ చేశాడట. ఇటీవల ఈ కథను చరణ్‌కు చెప్పి ఒప్పించారట. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ సన్నిహితుడైన పవన్‌ కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. పెద్ది చిత్రం పూర్తయిన వెంటనే చరణ్‌ త్రివిక్రమ్‌ సినిమాని సెట్స్‌పైకి వెళ్తుందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. 

సుక్కు మూవీకి బ్రేక్‌!
వాస్తవానికి పెద్ది తర్వాత చరణ్‌ .. సుకుమార్‌తో సినిమా చేయాల్సింది. ఇటీవల సుకుమార్‌ కూడా తన తదుపరి సినిమా చరణ్‌తోనే అని ప్రకటించాడు. కానీ పవన్‌ కల్యాణ్‌ కారణంగా చరణ్‌.. సుక్కు ప్రాజెక్టుని పక్కకు పెట్టి..త్రివిక్రమ్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. ఈ చిత్రం తర్వాత సుకుమార్‌తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. మరి సుక్కు అంతకాలం వెయిట్‌ చేస్తాడా లేదా మధ్యలో మరో హీరోని చూస్కొని సినిమా చేస్తాడా అనేది తెలియాల్సింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement