
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తండ్రి అయ్యాడు. గురువారం(మే 22) ఆయన సతీమణి రహస్య(Rahasya Gorak ) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
‘మగబిడ్డ పుట్టాడు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్యూ రహస్య. జై శ్రీరామ్'' అని కిరణ్ అబ్బవరం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా తన బాబుకు సంబంధించిన ఫస్ట్ ఫోటోని షేర్ చేసుకున్నారు. ఇందులో కిరణ్ తన కుమారుడి చిట్టి పాదాలను ముద్దాడుతూ కనిపించారు.
కిరణ్, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు బాబు పుట్టినట్లు తెలిపారు. దీంతో అభిమానులు కిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సినిమాల విషయాలకొస్తే..‘క’తో గతేడాది భారీ హిట్ అందుకున్నాడు.ఇటీవల వచ్చిన ‘దిల్ రూబా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.ప్రస్తుతం ‘కె-ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు.