
న్యూఢిల్లీ: రష్యాలో భారత ఎంపీల బృందానికి భయానక అనుభవం ఎదురైంది. వాళ్లు ఎక్కిన విమానం ల్యాండ్ అవ్వకుండా గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు చాలా ఆలస్యంగా.. విమానం ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గురువారం మాస్కో ఎయిర్‌పోర్టుపై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది. దీంతో విమానాల రాకపోకలను ఆపేసి.. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసేశారు. అయితే ఎయిర్‌పోర్ట్ మూసేయడంతో భారత ఎంపీలు ఉన్న విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. చివరకు అనుమతి లభించడంతో సేఫ్ ల్యాండ్ అయ్యింది. ఆపై భారత రాయబార ప్రతినిధులు వాళ్లకు స్వాగతం పలికి సురక్షితంగా హోటల్‌కు చేర్చారు.
All-Party Delegation led by Member of Parliament Ms. Kanimozhi Karunanidhi @KanimozhiDMK arrives in Moscow to convey 🇮🇳’s strong resolve to fight terrorism in all its forms. @PMOIndia @narendramodi @DrSJaishankar @MEAIndia @Office_of_KK @PIB_India @DDIndialive @DDNational… pic.twitter.com/Qu57uV5WHJ
— India in Russia (@IndEmbMoscow) May 22, 2025
పాక్‌పై దౌత్య యుద్ధంలో భాగంగా.. ఆ దేశం ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తోందని, దానిని భారత్ ఎలా ఎదుర్కొంటోందని.. అలాగే భారత్ విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచానికి చాటిచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపిస్తోంది. మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. మాస్కోకు వెళ్లిన బృందానికి డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వం వహిస్తున్నారు.