
ఉక్రెయిన్‌లో ప్లాంట్ చుట్టూతా పొంచి ఉన్న రేడియోధార్మికత ముప్పు
అప్రమత్తమైన యూరప్ దేశాలు
వెంటనే పర్యవేక్షణా బృందాన్ని పంపిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ
మాస్కో: జనావాసాలపై పరస్పర బాంబులేసుకుంటున్న ఉక్రెయిన్, రష్యాలు ఒక్కసారిగా యుద్ధంలో రేడియోధార్మికత భయాలను పెంచాయి. ఉక్రెయిన్‌కు చెందిన అత్యంత కీలకమైన జపోరి జియా అణువిద్యుత్ కేంద్రంపై ఆదివారం దాడి జరిగింది. ఈ న్యూక్లియర్ ప్లాంట్ ఆవరణలోని నిర్మాణం నుంచి భారీ స్థాయిలో మంటలు, పొగ వెలువడుతున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. అయితే దాడిలో అణువిద్యుత్ కేంద్రం ప్రధానభాగం దెబ్బతిన్నదా? లేదా? అనేది తెలియరాలేదు. దీంతో రేడియోధార్మికత వ్యాపించవచ్చన్న భయాలు ఒక్కసారిగా యూరప్‌లో వ్యాపించాయి.
యూరప్ ఖండంలోనే అతిపెద్ద అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా పేరొందిన జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌ను యుద్ధసమయంలో రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ రష్యా అధీనంలో ఉంది. దీంతో ఉక్రెయిన్ సేనలే తమ డ్రోన్ ద్వారా దాడికి పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్లాంట్ ప్రధాన నిర్మాణానికి 1,200 మీటర్ల దూరంలో దాడి వి ధ్వంసం జరిగిందని, ప్రమా ద అంచనా, నిజా నిజాలు నిగ్గుతేల్చేందుకు అంతర్జాతీ య అణుఇంధన సంస్థ (ఐఏఈఏ) తమ ప్రత్యేక పర్యవేక్షణా బృందాన్ని హుటాహుటిన జపోరి జియా ప్లాంట్‌కు పంపించింది. ‘‘ మా ఏజెన్సీ టీమ్‌ను ఇప్పటికే పంపించాం. దాడి ధాటికి రేడియో ధార్మికత వెలువడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఈ ఉపద్రవాన్ని అడ్డుకోక తప్పదు’’ అని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తంచేశారు.
రష్యా చమురు నిల్వ కేంద్రంపై దాడి
రష్యాలోని చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ దాడులకు తెగబడింది. దీంతో చమురు కేంద్రం తగలబడి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఆస్తి నష్టం పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. నల్ల సముద్ర తీరంలో రిసార్ట్‌లకు పేరెన్నికగన్న సోచీ సిటీలో ఈ ఆయిల్ డిపో ఉంది. ఏకంగా 120కిపైగా అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు శ్రమించారని క్రాన్సో్నడార్ రీజనల్ గవర్నర్ వెనియామిన్ కోంద్రాతెవ్ తన ‘టెలిగ్రామ్’ ఖాతాలో ఒక పోస్ట్‌చేశారు. దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా ముందజాగ్రత్తగా సోచీ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. గత 24 గంటల్లో 93 ఉక్రెయిన్ డ్రోన్లను నేలరాల్చామని రష్యా రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది. మరోవైపు తమపై 76 డ్రోన్లు, 7 క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆదివారం తెలిపింది.