North Korea: భవిష్యత్‌ నేత కిమ్‌ జు యే | North Korea Kim positioning daughter Kim Ju Ae as successor | Sakshi
Sakshi News home page

North Korea: భవిష్యత్‌ నేత కిమ్‌ జు యే

Feb 13 2026 12:42 AM | Updated on Feb 13 2026 1:33 AM

North Korea Kim positioning daughter Kim Ju Ae as successor

త్వరలో అధికారికంగా ప్రకటించనున్న కిమ్‌ జొంగ్‌ ఉన్‌ 

ఇప్పటికే వేదికను సిద్ధం చేసిన ఉత్తర కొరియా నేత 

దక్షిణ కొరియా నిఘా వర్గాల తాజా అంచనా

సియోల్‌: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌(42) తమ కుటుంబ పాలనను నాలుగో తరంలోనూ కొనసాగించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా దేశ భావి నేతగా 13 ఏళ్ల కుమార్తె కిమ్‌ జుయేను త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని సోదర దేశం దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల దక్షిణకొరియా పార్లమెంట్‌ సభ్యులతో జరిగిన నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సరీ్వస్‌(ఎన్‌ఐఎస్‌) ఉన్నతాధికారులు సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. 

ఈ నెలాఖరున జరిగే అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ విస్తృత సమావేశంలో కిమ్‌ వచ్చే ఐదేళ్లలో సాధించాల్సిన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలను వెల్లడించడంతోపాటు తన అధికార నియంత్రణను పదిలం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటారు. కిమ్‌ తన కుమార్తె కిమ్‌ జుయేను మొట్టమొదటిసారిగా 2022 నవంబర్‌లో జరిగిన క్షిపణి పరీక్షను తిలకించేందుకు తనతోపాటు తీసుకువచ్చారు. అప్పటి నుంచి తరచూ తండ్రితో కలిసి ఆయుధ పరీక్షలు, సైనిక కవాతులు, ఫ్యాక్టరీల ప్రారంభం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటోంది. 

గతేడాది సెపె్టంబర్‌లో కిమ్‌ చైనా పర్యటనకు కుమార్తెను వెంటబెట్టుకెళ్లారు. జనవరిలో నూతన సంవత్సరం రోజున తల్లిదండ్రులతోపాటు రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని కుమ్‌సుసన్‌ ప్యాలెస్‌కు వెళ్లింది. అక్కడ మొదటి, రెండో తరం పాలకులైన ముత్తాత కిమ్‌–2 సంగ్, తాత కిమ్‌ జొంగ్‌–2ల మాసోలియంలున్నాయి. ఉత్తర కొరియా తర్వాతి తరం పాలకురాలు కిమ్‌ జుయే అనే విషయం ఈ పరిణామంతో రూఢీ అయిందని విశ్లేషకులు అంటున్నారు. కిమ్‌ జొంగ్‌–2 అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడటంతో 2010లో జరిగిన పార్టీ సమావేశంలో కిమ్‌ జొంగ్‌ ఉన్‌(26)ను అధికారికంగా వారసుడిగా ప్రకటించారు. 

2011లో తండ్రి చనిపోయాక కిమ్‌ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటికి ఆయనకు సరైన పాలనా పరమైన అనుభవం లేదు. అలాంటి ఇబ్బంది రాకూడదనే కుమార్తెకు ముందుగా తగు అనుభవ పాఠాలు నేరి్పంచి, అధికారం అప్పగించే ఆలోచనలో కిమ్‌ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, కిమ్‌ కుమార్తె జొయే గురించిన వివరాలు పెద్దగా బయటకు తెలియడం లేదు. కిమ్‌ జొయేకు ఇద్దరు తోబుట్టువులు కూడా ఉన్నట్లు ఎన్‌ఐఎస్‌ భావిస్తోంది. వీరి వివరాలు కూడా స్పష్టంగా తెలియవు. 

ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థలు సైతం ఆమెను పేరుకు బదులుగా రెస్పెక్టెడ్‌ చైల్డ్‌ అనో మోస్ట్‌ బిలవ్డ్‌ చైల్డ్‌ అని మాత్రమే ప్రస్తావిస్తున్నాయి. త్వరలో జరిగే పార్టీ ఉన్నతస్థాయి సమావేశాన్ని తన పాలనను కొనసాగించే వ్యూహాన్ని అమలు చేసే వేదికగా కిమ్‌ మార్చుకుంటారని భావిస్తున్నారు. అందులో భాగంగానే, కుమార్తెకు పారీ్టలో ఫస్ట్‌ సెక్రటరీ పోస్టును ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఈ పోస్ట్‌ అధికారికంగా కిమ్‌ తర్వాత నంబర్‌– 2 స్థానం వంటిది. అయితే, ఇటువంటి కీలక పరిణామాలు వెంటనే బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement