ఉత్తర కొరియా యుద్ధానికి సిద్ధమవుతుందా? అంటే అవుననే సంకేతాలను ఆ దేశం పంపిస్తోంది. ఇప్పటికే 2 లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్షలు జరపడంతో నార్త్ కొరియాలోనే కాదు.. దక్షిణ కొరియాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతను పెంచుతోంది. డిసెంబర్ 28న పసుపు సముద్రంలో జరిగిన క్రూయిజ్ క్షిపణుల ప్రయోగాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ స్వయంగా పరిశీలించడం అనుమానాలను బల పరుస్తోంది. నార్త్ కొరియా చుట్టూ అమెరికా బలగాలతో పాటు సౌత్ కొరియాకు చెందిన బలగాలు ఇప్పటికే మోహరించి ఉండటంతో కిమ్ ఈ పరీక్షలు నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2 గంటల పాటు సాగిన క్షిపణుల ప్రయోగాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పరిశీలించడమే కాకుండా వాటి లక్ష్యాన్ని అవి ఛేదించగలుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను అధికారులు వెల్లడించారు. క్షిపణుల ప్రయోగానికి సంబంధించిన వీడియోలు బయటకు రాగానే దక్షిణ కొరియా అప్రమత్తమైంది. తమ జోలికి వస్తే అమెరికాతో కలిసి ఎదురొడ్డుతామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ విషయంలో జాగ్రత్త పడిన కిమ్ మాత్రం... యుద్ధానికోసం కాదని... క్షిపణుల పనితీరును పరిశీలించడం, దేశ ఆత్మరక్షణ నిమిత్తమే ఈ పరీక్షలు జరిగాయని వెల్లడించడం గమనార్హం.
అయినా అప్రమత్తమైన దక్షిణ కొరియా... కొరియా చుట్టూ మోహరించి ఉండటాన్ని గమనిస్తే ఏ క్షణమైన యుద్ధానికి సై అనే ప్రమాదం లేకపోలేదు. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం... లక్ష్యాన్ని ఛేదించడానికి ముందు క్షిపణులు 2 గంటల పాటు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయని... ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో క్షిపణి ప్రయోగం నుండి హిట్ టార్గెట్ వరకు వీడియోలను ఈ క్షిపణి పరీక్షపై కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా క్షిపణి పరీక్షను ధృవీకరించారు.
నార్త్ కొరియా చర్యలతో మరో వైపు దక్షిణ కొరియా కూడా తన సన్నాహాలను మరింత వేగవంతం చేసింది. గత ఆదివారం ఉదయం 8 గంటలకు ప్యోంగ్యాంగ్ సమీపంలోని సునాన్ ప్రాంతంలో అనేక క్రూయిజ్ క్షిపణులను నార్త్ కొరియా ప్రయోగించినట్లు సౌత్ కొరియా అధికారులు గమనించినట్లు చెప్పారు. ఒకవేళ నార్త్ కొరియా తోకాడిస్తై అమెరికాతో కలిసి తాము కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని సైనిక సన్నాహాలు చేశామని తెలిపింది. ఉత్తర కొరియా చేసే ఎలాంటి చర్యనైనా తిప్పి కొడతామని కూడా సౌత్ కొరియా హెచ్చరింది. ఉత్తర కొరియా అణ్వాయుధంతో నడిచే జలాంతర్గామిని నిర్మించే దిశగా ముందుకు కదులుతున్నట్లు కూడా అంతకుముందు వెల్లడించింది.


