ట్రంప్ భయం.. 37 ఏళ్ల రికార్డు బ్రేక్ | Khamenei broke a 37-year-old record | Sakshi
Sakshi News home page

ట్రంప్ భయం.. 37 ఏళ్ల రికార్డు బ్రేక్

Feb 9 2026 4:59 PM | Updated on Feb 9 2026 5:11 PM

Khamenei broke a 37-year-old record

ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తన నివాస రహస్యం ఎవరికీ తెలియకుండా  చాలా రహస్యంగా తలదాచుకుంటున్నారు. అమెరికా శాటిలైట్స్ సైతం కనిపెట్టకుండా ప్రత్యేకమైన బంకర్లలో ఆయన తలదాచుకుంటున్నట్లు సమాచారం .ఈ నేపథ్యంలో ఖమేనీ 37 ఏళ్లుగా ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశారు.

1989లో షియా మత గురువు ఆదేశ సుప్రీం లీడర్ రుహోల్లా ఖోమేని మరణాంతరం  ఆయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు నుంచి నేటి వరకూ దాదాపుగా 37 ఏళ్లుగా ఇరాన్ సుప్రీంగా ఖమేనీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దశాబ్ధాలుగా ఉన్న ఓ సంప్రదాయాన్ని అమెరికా ఉద్రికత్తల నేపథ్యంలో వదులుకోవాల్సి వచ్చింది.

1979 ఫిబ్రవరి 8వ తేదీ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది, ఆ రోజున ఒక బృందం వైమానిక దళ అధికారులు పహ్లావీ రాజవంశాన్ని కూలదోసినందుకు గాను రుహోల్లా ఖొమేనీకి విధేయత ప్రకటించారు. అనంతరం అప్పటి నుంచి ఆ రోజున  ఆ దేశ వైమానిక అధికారులతో ఇరాన్ సుప్రీం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. కరోనాతో ప్రపంచం మంతా ఆంక్షలు ఉన్న సమయంలోనూ ఈ సమావేశం నిర్వహించారు.

అయితే ప్రస్తుతం అమెరికాతో హాని పొంచి ఉన్న నేపథ్యంలో తొలిసారిగా ఆ దేశ సుప్రీం ఆ భేటీకి హాజరుకానట్లు ఇరాన్ అధికారులు ప్రకటించారు.  ఈ సారి ఆయనకు బదులుగా ఆ సమావేశానికి ఆర్మీ ఫోర్స్ చీఫ్  అబ్ధుల్ రహీం మౌస్వీ హాజరైనట్లు అధికారులు తెలిపారు. దీంతో  37 ఏళ్లుగా ఇరాన్ సుప్రీం పాటిస్తున్న సంప్రదాయానికి తొలిసారిగా బ్రేక్ పడినట్లయింది.

అయితే అమెరికాతో ముంపు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఖమేనీ బయిటకి రాలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు వెనక్కితగ్గేలా కనిపించడం లేదు. అణు కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్న యురేనియం శుద్ధి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో నిలిపేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. తమ దేశ సౌర్వభౌమాధికారం విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.

అటు అమెరికా తన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను అరేబియా సముద్రంలో మెుహరించింది. కొద్దిరోజుల క్రితం ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేసిన యుఎస్ ఇప్పుడు ఆ దేశంపైకి ఏ క్షణానైనా దాడి చేసేలా మరింత దగ్గరగా అబ్రహం లింకన్‌ను తీసుకవచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఏం జరగనుందా? అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement