ACE X review: విజయ్‌ సేతుపతి ‘ఏస్‌’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..? | Vijay Sethupathi ACE Movie Twitter Review In Telugu, Check These Tweets Before Watching Film | Sakshi
Sakshi News home page

ACE X Twitter Review: విజయ్‌ సేతుపతి ‘ఏస్‌’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..?

May 23 2025 11:33 AM | Updated on May 23 2025 12:12 PM

Vijay Sethupathi ACE Movie Twitter Review

వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏస్‌’(ACE).  దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్ నటించారు. శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తెలుగులో రిలీజ్‌ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టాలీవుడ్‌లో కూడా విజయ్‌ సేతుపతి ప్రమోషన్స్‌ చేయడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు(ACE Review). 

(చదవండి: డైరెక్టర్‌ నోటి దురుసు.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ భైరవం’)

ఇలా ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(ఏప్రిల్‌ 23) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇప్పటికే తమిళ్‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఫస్డ్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘ఏస్‌’ సినిమా ఎలా ఉంది? విజయ్‌ సేతుపతి ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి

ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్‌ చేస్తే.. యావరేజ్‌ ఫిల్మ్‌ అని మరికొంతమంది నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

 

 ‘ఏస్‌’ ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌. కడుపుబ్బా నవ్విస్తుంది. యాక్షన్‌, రొమాన్స్‌ కూడా కూడా ఆకట్టుకుంటాయి. లైఫ్‌లో అన్ని ఒత్తిళ్లను మరిచిపోయి హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. విజయ్‌ సేతుపతి తెరపై చాలా స్మార్ట్‌గా కనిపించాడు. యాక్టింగ్‌ నీట్‌గా ఉంది. రుక్మిని వసంత్‌ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. యోగిబాబు కామెడీ అదిరిపోయింది’ అని ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. 

 

 మలేషియాలో జరిగే దోపిడి ఆధారంగా నడిచే కామెడీ చిత్రమిది. విజయ్ సేతుపతి మాస్ క్లాస్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతితో కలిసి యోగి బాబు చేసిన కామెడీ సినిమాకు ప్లస్‌ అయింది. రుక్మిణి వసంత్ తన పాత్రకు న్యాయం చేసింది. సామ్ సీఎస్ బీజీఎం బాగుంది.అర్ముగ కుమార్ ఇంటెలిజెంట్ రైటింగ్ బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement