
'భోళా శంకర్' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆలోచనలో పడిపోయిన చిరంజీవి రూట్ మార్చారు. 'విశ్వంభర' మొదలుపెట్టారు. అయితే ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో లేట్ అవుతూ వస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలానే శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ మూవీ కమిట్ అయ్యారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.
(ఇదీ చదవండి: లండన్ నుంచి చెన్నై వచ్చి..దళపతి విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?)
రెండో ఇన్నింగ్స్‌లో చిరు సినిమాలు చేస్తున్నారు గానీ సరైన ఫలితాలు రావట్లేదు. ఈ క్రమంలోనే వచ్చి మంచి కమర్షియల్ హిట్ అయిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇప్పుడు మరోసారి చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ బాబీ అందుకున్నాడు. యష్ 'టాక్సిక్', దళపతి విజయ్ 'జననాయగన్' చిత్రాల్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. చిరు-బాబీ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
'మెగా 158' పేరుని ఈ ప్రాజెక్టుకి వర్కింగ్ టైటిల్‌గా నిర్ణయించారు. నెత్తురు-గొడ్డలిని పోస్టర్‌లో చూపించారు. చూస్తుంటే ఇది యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. మరి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు. హీరోయిన్, సంగీత దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తారేమో?
(ఇదీ చదవండి: చిరంజీవి లుక్‌లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి)
It’s the #ChiruBobby2 STATEMENT that sends shivers down the spine 🔥
‘The Blade that set the BLOODY BENCHMARK 💥’
A MEGASTAR @KChiruTweets hysteria in @dirbobby’s presentation ❤️
Produced by @KvnProductions & @LohithNK01 ✨#HBDMegastarChiranjeevi #MEGA158#ABC - AGAIN' BOBBY… pic.twitter.com/yCLmtNcRzX— KVN Productions (@KvnProductions) August 22, 2025