
దళపతి విజయ్.. తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఓ హీరో. ఓవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. సొంతంగా టీవీకే అనే పార్టీ పెట్టి, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నాడు. తాజాగా మధురైలో పార్టీ మీటింగ్ పెడితే లక్షలాది జనం తరలివచ్చారు. ఇలా విజయ్ గురించి చాలానే తెలుసు. కానీ ఈ హీరో ప్రేమ వివాహం చేసుకున్నాడని, ఓ సినిమా చూసి ఇతడిని, భార్య సంగీత పెళ్లి చేసుకుందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు?
దళపతి విజయ్ భార్య పేరు సంగీత సోమలింగం. భర్త ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఈమె ఎందుకనో మీడియా అట్రాక్షన్ కోరుకోలేదు. ఈమె గురించి మీడియాలో, సోషల్ మీడియాలోనూ పెద్దగా ప్రస్తావన ఉండదు. సంగీత విషయానికొస్తే.. ఈమె ఓ శ్రీలంకన్ తమిళియన్. తండ్రి యూకేకి వలస వెళ్లి బిజినెస్‌మ్యాన్ అయిపోయాడు. అలా యూకేలో తండ్రితో కలిసి నివసిస్తున్నప్పుడు అనుకోకుండా విజయ్ 'పూవే ఉనక్కాగ' సినిమా చూసిన సంగీత.. అతడితో వన్ సైడ్ ప్రేమలో పడిపోయింది. నేరుగా చెన్నైలో వాలిపోయింది.
(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)

ఓసారి షూటింగ్‌లో విజయ్‌ని కలిసిన సంగీత.. కొన్ని గంటలపాటు మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నది కాస్త డిన్నర్ డేట్ వరకు వెళ్లింది. తర్వాత దాదాపు మూడేళ్ల పాటు విజయ్-సంగీత డేటింగ్ చేసుకున్నారు. అలా కొన్నాళ్ల తర్వాత సంగీత తల్లిదండ్రులని విజయ్ కలవడం, వాళ్లకు ఇతడు నచ్చడంతో పెళ్లికి అంగీకారం తెలిపారు. అలా 1999లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహ వేడుక జరిగింది. తర్వాత జేసన్, దివ్య అని ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
హీరోగా విజయ్.. ఇన్నేళ్ల పాటు తన క్రేజ్ అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నాడు. మరోవైపు సంగీత కూడా రూ.400 కోట్లకు ఆస్తిపరురాలని కొన్ని ఆర్టికల్స్‌లో ప్రస్తావించారు. అలా భర్త ఎంత సెలబ్రిటీ అయినా సరే మీడియా అటెన్షన్ పడకుండా లో-ప్రొఫైల్ మెంటైన్ చేయడం అంటే విచిత్రమనే చెప్పాలి.
(ఇదీ చదవండి: చిరంజీవి లుక్‌లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి)