
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'కె ర్యాంప్', 'చెన్నై లవ్ స్టోరీ' అనే సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్‌గానే తండ్రిగానూ ప్రమోషన్ పొందాడు. గతేడాది ఆగస్టులో పెళ్లి జరగ్గా.. ఏడాదిలోనే తండ్రి అయిపోయాడు. ఈ క్రమంలోనే పెళ్లిరోజు రావడంతో భార్యకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. అలానే కిరణ్ భార్య రహస్య కూడా పోస్ట్ పెట్టింది. కానీ పెళ్లి నాటి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)
కిరణ్-రహస్య ప్రేమ వివాహాం చేసుకున్నారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో వీళ్లిద్దరూ టాలీవుడ్‌కి పరిచమయ్యారు. తర్వాత కిరణ్ వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోగా.. రహస్య మాత్రం నటన పక్కనబెట్టేసి ఉద్యోగం చేసుకుంది. స్నేహితులుగా మొదలైన వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో గతేడాది ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే తొలి పెళ్లిరోజు సందర్భంగా కిరణ్ భార్య రహస్య పోస్ట్ పెట్టింది. 'పెళ్లికి సరిగ్గా గంటముందు నాకు చాలా ఆందోళనగా ఉంది. నా గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అప్పుడు నా దగ్గరికి వచ్చిన కిరణ్ ఈ నోట్ ఇచ్చాడు. దీంతో ప్రశాంతంగా ధైర్యంగా అనిపించింది. ఏం జరిగినా సరే ఇతడు చూసుకుంటాడులే అనిపించింది. ఇదే నాకు దక్కిన బెస్ట్ గిఫ్ట్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కిరణ్ అబ్బవరం' అని రహస్య రాసుకొచ్చింది. ఈమె షేర్ చేసిన ఫొటోలు.. కిరణ్ 'నన్ను భర్తగా కోరుకున్నందుకు థ్యాంక్యూ. నా జీవితంలోకి స్వాగతం. బాగా చూసుకుంటా' అని రాసిచ్చిన నోట్ చూడొచ్చు.
(ఇదీ చదవండి: మంచు విష్ణు డేర్.. రూ. 100 కోట్ల పెట్టుబడితో బిగ్ ప్లాన్)