
'కన్నప్ప' (Kannappa) సినిమాను నిర్మించడం కోసం మంచు విష్ణు పెద్ద సాహసమే చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఆయన రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో మంచు విష్ణు మరో అడుగు ముందుకువేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఒక ప్రాజెక్ట్ కోసం ఆయన ఏకంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కన్నప్ప విజయం తర్వాత నటుడు, నిర్మాత విష్ణు మంచు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు. అతను మైక్రోడ్రామాలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని ఇండస్ట్రీ వర్గలు చెబుతున్నాయి. విష్ణు తన సొంత డబ్బుతో పాటు కొందరి భాగస్వామ్యంతో వినోద రంగంలో సంచలనానికి తెరలేపనున్నారు. ఈ వార్త టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
మైక్రోడ్రామాలు అంటే ఏమిటి?
మైక్రోడ్రామాలు అంటే చిన్న పరిమాణంలో, తక్కువ వ్యవధిలో, పరిమిత పాత్రలతో, గాఢమైన భావోద్వేగాలను వ్యక్తపరచే నాటకాలు. ఇవి సాధారణంగా 1 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఉంటాయి. ఒకే సంఘటన లేదా భావన చుట్టూ తిరుగుతాయి. సాధారణ సోషల్ మీడియా రీల్స్ మాదిరిగా కాకుండా.. ఈ కథలు ప్రొఫెషనల్ దర్శకత్వంతో పాటు అధిక-నాణ్యత నిర్మాణం ఆపై బలమైన కథ చెప్పడం వంటి అంశాలతో ఉంటాయి.
విష్ణు కొత్త ప్రాజెక్ట్ భారతీయ వినోదంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేయనున్నాడని కొందరు అంటున్నారు. విష్ణు నిర్ణయం వల్ల నటన, రచన, దర్శకత్వం వంటి అంశాల్లో కొత్త వారికి భారీగా ఛాన్సులు దొరుకుతాయి. ఆపై కంటెంట్ కూడా ఎక్కువగా సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఉటుందని కొందరు చెబుతున్నారు. ఇది భారతీయ వినోద రంగంలో గేమ్-చేంజర్ అవుతుందని భావిస్తున్నారు.