
గతంలో సినిమాని సినిమాగా చూసి ఎంటర్‌టైన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రాఫిక్స్, లాజిక్కులు, హీరో లుక్.. ఇలా అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఏ మాత్రం తేడా అనిపించినా సరే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రీసెంట్ టైంలో హరిహర వీరమల్లు, వార్ 2 చిత్రాలు ఇలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నాయి. గతేడాది 'విశ్వంభర' కూడా టీజర్‌తో చాలానే విమర్శలు ఎదుర్కొంది.
అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి.. తన కొత్త సినిమా విషయంలో ముందే జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ డైరెక్టర్.. చిరంజీవితో ఓ కామెడీ మూవీ చేస్తున్నాడు. చిరు బర్త్ డే సందర్భంగా తాజాగా టైటిల్ రివీల్ చేశారు. 'మన శంకర వరప్రసాద్ గారు' అని టైటిల్ పెట్టినట్లు చెబుతూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సిగరెట్ తాగుతూ సూట్ వేసుకుని చిరంజీవి స్టైలిష్‌గా కనిపించారు.
(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)
అయితే చిరు లుక్‌పై ట్రోల్స్ వస్తాయని భయపడ్డాడో ఏమో గానీ అనిల్ రావిపూడి.. 'చిరంజీవి సూట్‌లో ఎలా ఉంటారో చూడటం నాకు చాలా ఇష్టం. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి. చిరంజీవి లుక్‌కి VFX ఏమి లేదు.. 95 శాతం ఒరిజినల్' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కోసం జిమ్‌కి వెళ్లి సన్నబడ్డారని చెప్పుకొచ్చాడు. అనిల్ స్పీచ్ చూస్తుంటే ట్రోల్స్ వచ్చి తర్వాత క్లారిటీ ఇవ్వడం కంటే ముందే జాగ్రత్తపడుతున్నాడేమో అనిపిస్తుంది.
ఈ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా భీమ్స్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం చిరంజీవి 'విశ్వంభర' ఈ మూవీ కంటే ముందు రిలీజ్ కావాలి. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ)