
అనుపర పరమేశ్వరన్ వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'పరదా'.. ఈ రోజే(ఆగస్టు 22) థియేటర్లలోకి వచ్చింది. మరో మూడు వారాల్లో 'కిష్కిందకాండ' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇకపోతే కొన్నిరోజుల క్రితం ఈమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా.. పలు వివాదాల్లో చిక్కుకుంది. తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా?
(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)
కోర్ట్ రూమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన 'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ'.. గతవారం ఓటీటీలోకి వచ్చింది. అయితే మలయాళ, కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. దీంతో తెలుగు ఆడియెన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు వారం లేటుగా తెలుగు వెర్షన్ తీసుకొచ్చేశారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.
'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ' విషయానికొస్తే.. జానకి విద్యాధరన్(అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తుంటుంది. పండగ జరుపుకొనేందుకు కేరళలోని సొంతూరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లినప్పుడు ఈమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో పోలీసులని ఆశ్రయిస్తుంది. ఈ న్యాయ పోరాటంలో జానకి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? ఈ కేసులో అడ్వకేట్ డేవిడ్(సురేశ్ గోపి) ఎవరివైపు నిలిచారు? తన ప్రమేయం లేకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డని ప్రభుత్వమే చూడాలనే జానకి విజ్ఞప్తిపై కేరళ హైకోర్ట్ ఎలా స్పందించింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)
JSK – Janaki V/s State of Kerala is now streaming on ZEE5. A powerful courtroom drama where truth takes the spotlight. Watch it now in Telugu! 🎬⚖️
Don’t miss it!"#JanakiVsStateOfKeralaOnZEE5@TheSureshGopi @anupamahere @jsujithnair @DreamBig_film_s
#PravinNarayanan pic.twitter.com/375xPZL7lm— ZEE5 Telugu (@ZEE5Telugu) August 22, 2025