
తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు ఇక్కడే నివాసం ఉంటుంటారు (ఇతర భాషల వాళ్లు మినహా). సినిమా షూటింగ్‌లకు అనువైన స్టూడియోలు ఇటు భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్టింగులు వేసి చిత్రీకరణలు జరుపుతుంటారు మేకర్స్. ప్రస్తుతం భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాగచైతన్య, రామ్ పోతినేని, విజయ్ సేతుపతి, సాయిదుర్గా తేజ్, తేజా సజ్జా, అఖిల్ అక్కినేని, సిద్ధు జొన్నలగడ్డ వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్‌లో హుషా రుగా పాల్గొంటున్నారు. ఇక భాగ్యనగరంలో ఎవరెక్కడ? షూటింగ్‌లో పాల్గొంటున్నారో ఆ విశేషాలేంటో చూద్దాం...
అజీజ్ నగర్‌లో రాజా సాబ్
‘బాహుబలి’ సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లో పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మారుతి.
హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాత పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిందట.. మరో పది శాతం చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరగా షూటింగ్‌ని పూర్తి చేసి ఈ సినిమాకి ఎంతో కీలకం కానున్న గ్రాఫిక్స్ పనులపై దృష్టి పెట్టనున్నారట మారుతి. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయని టాక్.
అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉస్తాద్
హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ‘గబ్బర్ సింగ్’ (2012) చిత్రం మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ΄ోలీసాఫీసర్ ΄ాత్ర చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల ఈ సినిమా పతాక సన్నివేశాలు పూర్తయినట్లు ప్రకటించారు మేకర్స్. క్లైమాక్స్‌లో భాగంగా నబకాంత మాస్టర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.
డ్రాగన్ జోరు
‘దేవర’ వంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో ΄ాటు ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు దర్శకుడు. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూ΄÷ందుతోన్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జూన్ 25న విడుదలకానుంది.
శంకరపల్లిలో పెద్ది
రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో(2021) బ్లాక్‌బస్టర్ అందు కున్న బుచ్చిబాబు సానా ‘పెద్ది’కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ΄ాన్ ఇండియా మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. రామ్‌చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అలాగే భాగ్యనగరం సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో నైట్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. రామ్‌చరణ్, జాన్వీలపై ఈ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రత్యేకమైన సెట్‌లో...
‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో ΄ాటు వంద కోట్ల క్లబ్‌లో చేరారు నాగచైతన్య. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్‌సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీని తెరకెక్కించిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, ఇతర తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మిస్టీక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన ఫిజికల్‌గానూ కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు కూడా. ‘తండేల్’ తర్వాత నాగచైతన్య, ‘విరూ΄ాక్ష’ తర్వాత కార్తీక్ వర్మ కాంబినేషన్‌లో రానున్న ‘ఎన్‌సీ 24’ సినిమాపై మంచి బజ్ నెలకొంది.
ముచ్చింతల్‌లో ఆంధ్ర కింగ్
రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, కన్నడ హీరో ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. రామ్–భాగ్యశ్రీలతో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూ΄÷ందిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌గా నటించిన ఉపేంద్రకి వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు.
అల్యూమినియం ఫ్యాక్టరీలో...
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. టబు, కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్‌పై పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ ΄ాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతితో ΄ాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్ చిత్రీకరణలో ΄ాల్గొంటున్నారట. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
బూత్ బంగ్లాలో లెనిన్
అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న చిత్రం ‘లెనిన్’. ‘ఏజెంట్’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ఇది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్.
ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో అఖిల్, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. అయితే కొద్ది రోజులు షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఇందుకుగల కారణాలు మాత్రం బయటకు రాలేదు. అఖిల్‌కి జోడీగా ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తుక్కుగూడలో సంబరాలు...
సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల యేటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరో, హీరోయిన్‌తో ΄ాటు ఇతర తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట రోహిత్ కేపీ. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 25న ప్రేక్షకులముందుకు రానుంది.
పతాక సన్నివేశాల్లో యోధ
‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జా ‘హను–మాన్’ (2024) చిత్రంతో ΄ాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న మరో ΄ా¯Œ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ‘మిరాయ్’ చిత్రం 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్‌లో సెప్టెంబర్ 5న విడుదలకానుంది.
శంకరపల్లిలో తెలుసు కదా
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధం, వినోదం, భావోద్వేగాల నేపథ్యంలో రూ΄÷ందుతోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా హీరో హీరోయిన్లతో ΄ాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు నీరజ కోన. దీ΄ావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది.
ఇలా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ జరుపుకుంటున్న సినిమాలు పైన పేర్కొన్నవి కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి.
– డేరంగుల జగన్ మోహన్