
విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఏస్’. అరుముగ కుమార్ దర్శకత్వంలో 7సీఎస్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై అరుముగ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు విడుదల హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించు కుంది. పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి. శివప్రసాద్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.
‘‘ఏస్’ కోసం ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు పోటీ పడినా తెలుగు విడుదల హక్కులను మేము దక్కించుకోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు బి. శివ ప్రసాద్.