కీ రోల్‌కి సై | Actress Anjali comes onboard actor Vishal's film with director Ravi Arasu | Sakshi
Sakshi News home page

కీ రోల్‌కి సై

Aug 23 2025 12:41 AM | Updated on Aug 23 2025 12:41 AM

Actress Anjali comes onboard actor Vishal's film with director Ravi Arasu

విశాల్‌ హీరోగా రవి అరసు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుషారా విజయన్  కథానాయికగా నటిస్తున్నారు. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌పై ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్నారు. విశాల్‌ కెరీర్‌లో 35వ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్  అంజలి కీ రోల్‌లో నటిస్తున్న విషయాన్ని మేకర్స్‌ ప్రకటించారు. ‘‘అంజలి ప్రస్తుతం ఆచితూచిపాత్రలను ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలో విశాల్‌ 35 కథ నచ్చి, ఆమె ఓకే చెప్పారు. ‘మద గద రాజా’ చిత్రంలో అంజలి, వరలక్ష్మిలతో విశాల్‌ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement