
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చేశారు. బుధవారం విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇవాళ అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చారు. మెగా 157 టైటిల్ను రివీల్ చేశారు. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
ఈ ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రాబోయే రోజుల్లో మెగాస్టార్- బాలయ్యతో కలిసి సినిమా చేస్తారా అని? మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అనిల్ రావిపూడి స్పందించారు. వెంకటేశ్, చిరంజీవితో మన ప్రయాణం మొదలైంది.. బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో చిరంజీవిగారే మైకులో చెప్పారని అనిల్ తెలిపారు. ఇద్దరు కూడా ఎవరికీ వారు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న హీరోలు.. వారికి తగిన కథ సెట్ అయితే తప్పకుండా చేస్తానన్నారు. అలాంటి కథ కుదిరితే ఎవరు చేసినా బాగుంటుందని అనిల్ రావిపూడి అన్నారు.