
సాక్షి,బెంగళూరు: ఓ మహిళపై సామూహిక అత్యాచారం. ఆపై జైలు శిక్ష, బెయిల్‌పై విడుదల. ఈ తరహా దారుణాల నిందితులు చేసిన తప్పుకు పశ్చాతాపానికి గురవుతుంటారు. సమాజంలో తిరగలేక సిగ్గుతో తలదించుకుంటుంటారు. కానీ కర్ణాటక కేసు నిందితులు అందుకు భిన్నంగా వ్యవహించారు. బెయిల్ రావడంతో బైక్, కార్లలో తిరుగుతూ విజయోత్సవ ర్యాలీలు జరిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల,గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురు ప్రధాన నిందితులు అఫ్తాబ్, మదర్ సాబ్, సమీవుల్లా, మొహమ్మద్ సాదిక్, తౌసీఫ్, రియాజ్, షోయిబ్‌లకు కర్ణాటక హవేరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం, చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి సంబరాలు చేసుకున్నారు. వీధుల్లో కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
SHOCKING 🚨 7 Gang rape accused take out road show after securing BAIL in Karnataka's Haveri.
Names — Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar, Aptab Chandanakatti, Madar Saab Mandakki, and Riyaz Savikeri. pic.twitter.com/pNMF21YXJy— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2025
కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే..
2024 జనవరి 8న కర్ణాటకలోని హవేరీ జిల్లాలో హనగర్‌కు చెందిన ఓ హోటల్ గదిలో దారుణం జరిగింది. నిందితులు హోటల్ గదిలోకి చొరబడి ఓ జంటపై దాడి చేశారు. అనంతరం బాధితురాల్ని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తాజాగా, ఆ కేసులో ఏడుగురు ప్రధాన నిందితలు బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ రావడంపై నిందితులు హవేరి జిల్లా అక్కి అలూరు పట్టణంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్‌లు, కార్లు, డీజే మ్యూజిక్‌తో కూడిన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిరునవ్వుతో చేతులు ఊపుతూ, విజయోత్సవ సంకేతాలిచ్చిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి.
బాధితురాలు ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు. ఆమె కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడితో కలిసి 2024 జనవరి 8న హనగల్‌కు చెందిన ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు.
అయితే జనవరి 11న న్యాయమూర్తి ఎదుట బాధితురాలు స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు మొత్తం 19 మందిని అరెస్ట్ అయ్యారు. వీరిలో 12 మందిని దాదాపు 10 నెలల క్రితమే బెయిల్‌పై విడుదల చేశారు. కానీ, ఏడుగురు ప్రధాన నిందితులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆ ఏడుగురికి న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో నిందితులు బైక్‌లు,కార్లలో ర్యాలీతో సంబరాలు చేసుకున్నారు.
ఈ ఘటనపై నెటిజన్లు, స్థానికులు.. న్యాయం గెలవాలన్న ఆశతో బాధితురాలు ఎదురుచూస్తున్న సమయంలో నిందితులు చేసిన విజయోత్సవాల ర్యాలీ బాధితురాలిని మరింత మానసికంగా దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు.