
న్యూఢిల్లీ: రోజుకు ఎన్నో చిత్ర విచిత్రాలను చూస్తున్నాం. తాజా ఘటన కూడా చాలా చిత్రమైందే. ఓ భార్య తన లవర్‌తో దిగిన ఫోటోలు, వీడియోలు భర్త ఫోన్‌లో ఉన్నాయనే కారణంతో వాటి కోసం ఇద్దరు మనుషల్ని పురమాయించింది. భర్తన పట్టుకునైనా ఆ ఫోన్ తీసుకుని లవర్‌తో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయాలనే ప్లాన్ చేసింది.
ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఇద్దర్ని మాట్లాడుకుంది. భర్త రూట్ మ్యాప్ అంతా ఇచ్చింది. భర్త ఆఫీస్‌కు ఏ రూట్‌లో వెళతాడు.. ఎన్ని గంటలకు ఎక్కడకు చేరుకుంటాడు అనే వివరాల ఇచ్చింది. ఇందులో భర్త వర్క్ టైమింగ్స్ అన్ని షేర్ చేసింది. భర్త ఫోన్‌లో లవర్‌తో దిగిన ఫోటోలు కొంపముంచుతాయేమోనని భయపడి ఈ కుట్రకు తెరలేపింది భార్య. లవర్‌తో ఉన్నప్పుడు భర్త వాడే ప్రత్యామ్నాయ ఫోన్‌తో ఫోటోల దిగింది కానీ, ఆ ఫోన్ తిరిగి భర్త తీసుకోవడంతో భార్యకు కంగారు పట్టకుంది. ఎలాగైనా ఆ ఫోటోలు భర్త కంటపడకుండా చేయాలని భావించింది.
ఇందుకు గాను ఇద్దరు వ్యక్తులను పురమాయించగా, ఒకరు పోలీసులకు దొరికిపోయాడు. అంకిత్ గోహ్లత్ అనే 27 ఏళ్ల వ్యక్తి,, అద్దెకు ఒక స్కూటర్ తీసుకుని ప్రణాళిక అమలు చేశాడు.. ఫోన్ అయితే దొంగిలించారు కానీ, ఆ ఫోన్ దొంగిలించబడిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిలో భాగంగా నిఘా ఉంచారు పోలీసులు. లవర్‌తో దిగిన ఫోటోలను డిలీట్ చేశారు కానీ విషయమైతే పోలీసులకు వెల్లడించాడు పట్టుబడిన వ్యక్తి.
దాంతో అతన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు పట్టుకోగా అసలు విసయం బయటపడింది. ఆతని భార్యే ఫోన్ దొంగిలించాడానికి తనను పురామాయించిందని అసలు విషయం చెప్పేశాడు సదరు ‘దొంగ’. ఈ విషయం తమ దర్యాప్తులో తేలినట్లు ఢిల్లీ(సౌత్) డీసీపీ అంకిత్ చౌహాన్ వెల్లడించారు. సినిమా తలపించే ట్విస్టులున్న ఈ ఘటన జూన్ 19వ తేదీన జరగ్గా, చివరకు ఆ ఫోన్ ఎక్కడుందో పోలీసులకు తమ ఛేదనలో దొరకడంతో భార్య బండారం బయటపడింది.