
భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చడం లేదన్న అసహనంతో ఓ భార్య పక్కదారి పట్టింది. భర్తను అడ్డుతొలగించుకునే ప్రయత్నంలో కట్టుకథ అల్లింది. కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు ఊరుకుంటారా?.. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజం బయటపెట్టింది.
జులై 20వ తేదీన నీహాల్ విహార్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఫర్జానా ఖాన్(29) అనే మహిళ తన భర్త మొహమ్మద్ షాహిద్(32)ను హతమార్చింది. ఆపై ఏం ఎరగనట్లు భర్త మృతదేహంతో ఆస్పత్రికి వెళ్లింది. తన భర్త ఆన్‌లైన్ రమ్మీలో డబ్బు పొగొట్టుకున్నాడని, అప్పుల బాధ భరించలేక కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని కన్నీళ్లు పెట్టుకుంది.
అయితే షాహిద్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించిన వైద్యులు.. గాయాలపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమె మొబైల్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
సల్పాస్ మందుతో హత్య చేయడం ఎలా?.. చాట్ హిస్టరీ డిలీట్ చేయడం ఎలా? అనే అంశాలను ఆమె సెర్చ్ చేసినట్లు ఉంది. వీటి ఆధారంగా ఆమెను ప్రశ్నించగా.. తానే నేరం చేసినట్లు ఒప్పుకుంది. భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చలేకపోతున్నాడని, ఈ క్రమంలోనే తాను మూడుసార్లు కత్తితో పొడిచి హతమార్చానని చెబుతోంది.
అయితే ఆమె ఎవరితో, ఏం చాటింగ్ చేసిందనేది తేలాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తకు నిద్రమాత్రలిచ్చి, ఆపై కరెంట్ షాక్ పెట్టి హతమార్చింది. ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటకు రావడంతో ఈ కేసు వెలుగు చూసింది. అందుకు సంబంధించిన కథనం కింది లింక్‌లో చదవండి.👇
ఇదీ చదవండి: నా భర్త బతికే ఉన్నాడు.. నిద్ర వస్తోంది.. నువ్వు రా