చమురు కంపెనీలు ఫిబ్రవరి 1, ఆదివారం నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.49 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రిటైల్ ధర రూ.1,740.50కు చేరుకుంది. అయితే గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు.
రంగాలపై ప్రభావం
గతంలో కమర్షియల్ గ్యాస్ ధరల తగ్గింపుతో ఊపిరి పీల్చుకున్న ఆతిథ్య, క్యాటరింగ్ రంగాలు తాజా పెంపుతో మళ్లీ ప్రభావితమయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. వంట గ్యాస్ ఖర్చులు పెరగడం వల్ల బయట ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య గ్యాస్‌పై ఆధారపడే టీ స్టాళ్లు, స్వీట్ షాపులపై ఈ ప్రభావం నేరుగా పడుతుంది.
ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె..


